iDreamPost

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం: కేటీఆర్

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే..  జాబ్ క్యాలెండర్ అమలు చేస్తాం: కేటీఆర్

తెలంగాణ లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రచారాలతో దుమ్మురేపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి హ్యాట్రిక్ విజయం సాధించాలని బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. కాంగ్రెస్ జాతీయ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు మొదటి విడత ప్రచారం చేసి ఢిల్లీ పయణం అయ్యారు. త్వరలో రెండో విడత ప్రచారం కొనసాగించేందుకు సిద్దమవుతున్నారు. ఈసారి తమ ప్రభుత్వాన్ని గెలిపిస్తే.. తాము ఏం చేయనున్నామో ‘కేసీఆర్ భరోసా’ పేరుతో కొత్త కార్యక్రమానికి నిర్వహించున్నామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. వివరాల్లోకి వెళితే..

ఇటీవల పలు సీనియర్ నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటున్న విషయం తెలిసిందే. పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు సత్యనారాయణరెడ్డి, రాంమూర్తి నేడు మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజలు బీఆర్ఎస్ ని ఆశీర్వదిస్తూ వస్తున్నారు. ఇప్పటి వరకు బీఆర్ఎస్ ఎన్నో అభివృద్ది సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చింది. ప్రతిపక్ష నేతలు లేని పోని హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు పనికట్టుకొని మాపై దుష్ప్రచారాన్ని చేస్తున్నారు.

ఈసారి జరగబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ కి మరోసారి ఛాన్స్ ఇస్తే.. కేసీఆర్ భరోసా కింద 15 కార్యక్రమాలను అమలు చేస్తాం. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని భరోసా ఇస్తున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ కి పట్టం కట్టిన ప్రజలు ఇప్పుడు ఎన్నో కష్టాలు పడుతున్నారు. కర్ణాటకలో 5 గంటలు పాటు విద్యుత్ ను కూడా వ్యవసాయానికి సరిపడ ఇవ్వలేని దుస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్ నేతలపై రైతులు తీవ్ర ఆగ్రహం ప్రదర్శిస్తున్నారు. ఏఐసీసీ చీఫ్ ఖర్గే సొంత రాష్ట్రం కర్ణాటకలోనే దారుణ దుస్థితి నెలకొందని కేసీఆర్ విమర్శించారు. కేసీఆర్ ఇచ్చే 24 గంటల విద్యుత్ కావాలా? రేవంత్ రెడ్డి చెప్పిన 3 గంటల విద్యుత్ కావాలా? అన్నది ప్రజలే నిర్ణయిస్తారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి