iDreamPost

KTR: వీడియో: హీరోయిన్ల ఫోన్స్ ట్యాపింగ్ ఆరోపణలపై KTR ఫస్ట్ రియాక్షన్!

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఇష్యూపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఇష్యూపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ ఇష్యూపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. 

KTR: వీడియో: హీరోయిన్ల ఫోన్స్ ట్యాపింగ్ ఆరోపణలపై KTR ఫస్ట్ రియాక్షన్!

తెలంగాణలో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఇష్యూపై అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. గ్యారంటీలను అమలు చేయలేక నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే ట్యాపింగ్‌ వ్యవహారం తెరమీదకి తీసుకొచ్చారని బీఆర్ఎస్ విమర్శిస్తుంటే, లై డిటెక్టర్‌ పరీక్షకు కేటీఆర్‌ సిద్ధమా అని కాంగ్రెస్‌ ప్రశ్నిస్తోంది. ఇదే సమయంలో బీజేపీ కూడా ఈ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తోంది. సినిమా హీరోయిన్ల ఫోన్లను కూడా  ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చాక పొలిటికల్ సునామీ చెలరేగింది. గత పాలకులపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ సైతం మండిపడుతోన్నాయి. కొందరు నేతలు మా ఫోన్లు ట్యాప్ చేశారంటూ డీజీపీకి ఫిర్యాదులు అందాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత రఘనందన్ రావు డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలానే పలువురు కాంగ్రెస్ నేతలు కూడా డీజీపీని కలిసి వినతి పత్రం అందించారు. అలానే హీరోయిన్ల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కేటీఆర్ పై ఆరోపణలు చేశారు. ఈ ఇష్యూపై కేటీఆర్ రియాక్ట్ అయ్యారు.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేటీఆర్ కామెంట్స్ చేశారు.

కేటీఆర్ మాట్లాడుతూ..” ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో నాకు సంబందం లేదు. అలానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో అస్సలు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ అంటూ మాట్లాడుతున్న లీకు వీరుడు రేవంత్ రెడ్డి గారికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే దమ్ములేదు. వాటికి సంబంధించిన ఆధారాలను ప్రజల ముందు పెట్టే దమ్ము కాడ లేదు. అసలు అందులే ఏముందో తెలియదు. పోలీస్ రిమాండ్ లో ఉన్నవాళ్ల ఫోన్ల నుంచి కూడా మీకు లీకులు వస్తాయి. రేవంత్ రెడ్డి ఏదో కష్టపడి నా క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలని చూస్తున్నాడు. ఎవరో హీరోయిన్లను నేను బెదిరించానని ఓ మహిళ మంత్రి అన్నారు. ఆమెకు నెత్తి ఉందా లేదా నాకు అర్థం కావడంలేదు. నాకు అంత ఖర్మ ఏంది. ఆ దిక్కుమాలిన పనులు చేయాల్సిన అవసరం నాకేంది.

మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా ఎవరైనా సరే ఇలాంటి మాటలు మాట్లాడితే..వారి తాట తీస్తాము. వారి ఆరోపణలపై లీగల్ గానే వారితో ఫైట్ చేస్తాము. తాటతీస్తాం అంటే మళ్లీ దానిన్ని వేరే అర్థంలో మీడియాలో చూపిస్తారేమో.. అలా చూపెట్టకండి. మాకు ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. ఏదైనా న్యాయపరంగానే ఎదుర్కొంటాము. మీడియా మిత్రులను నేను ఒకటి కోరుతున్నాను.  2014లో మా ప్రభుత్వం ఉంది. అంతక ముందుకు కూడా ఫోన్ ట్యాపింగ్ లు జరిగినట్లు స్వయంగా అప్పటి కాంగ్రెస్ నేతలే ఆరోపించారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తమ ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆనాంటి కాంగ్రెస్ మంత్రులు ఆరోపించారు. కాబట్టి రేవంత్ రెడ్డి..2004 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్, ఇతర అవినీతి పనుల గురించి కూడా దర్యాప్తు చేయండి” అంటూ కేటీఆర్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి