iDreamPost

కొరటాలకి కొత్త కష్టం.. అందరికీ Jr.NTR కావాలట!

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబోలో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇక, దేవర 2 విషయంలో...

యంగ్‌ టైగర్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌-కొరటాల శివ కాంబోలో దేవర సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఇక, దేవర 2 విషయంలో...

కొరటాలకి కొత్త కష్టం.. అందరికీ Jr.NTR కావాలట!

యంగ్ టైగర్ “జూనియర్ ఎన్టీఆర్” పాన్ ఇండియా లెవెల్లో క్రేజ్ ఉన్న హీరో. ఈ హీరోతో సినిమా తీయడం అంటే మాటలా!. ప్రతి దర్శకుడూ వెయిట్ చేయాల్సిందే మరి. “ఆర్ ఆర్ ఆర్” చిత్రంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాడు దర్శకుడు ‘రాజమౌళి’. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్ర అత్యంత కీలకం. ఇక ఈ హీరో యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో ఎన్టీఆర్ తన నటనకు ఎన్నో అవార్డులను అందుకున్నాడు. ఆ చిత్రం తర్వాత ‘ఎన్టీఆర్ ‘ నటిస్తున్న సినిమా “దేవర”.

ఇది అందరికీ తెల్సిన విషయమే. ‘కొరటాల శివ’ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కతుంది. ఇప్పటికే దేవర సినిమా షూటింగ్ శరావేగంగా సాగుతోంది. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదుల చేయబోతున్నాం.. అని దర్శకుడు అధికారికంగా ప్రకటించాడు. దేవర-1 ను రాబోయే వేసవిలో విడుదుల చేయనున్నారట. ఇక దేవర-2 వెంటనే 2025 లో విడుదల చేస్తారని అభిమానులు భావిస్తున్నారు. అయితే అసలు చిక్కు ఇక్కడే వచ్చి పడింది. అదేంటంటే! దేవర-2 కి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి షూటింగ్ ప్రారంభం కాలేదు.

పోగా.. ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయాలంటే.. దానికంటే ముందు కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేయాల్సి ఉంటుందట. ఇప్పటికే ఈ హీరో ‘వార్-2’ ,దర్శకుడు ‘ప్రశాంత్ నీల్’ చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ రెండు చిత్రాలు కంప్లీట్ అయ్యాక మాత్రమే ‘దేవర-2 ‘ సినిమాలో నటించగలడు. ‘వార్-2’ మూవీ షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఇక దర్శకుడు ‘ప్రశాంత్ నీల్’.. “సలార్” చిత్రం తర్వాత వెంటనే ‘ఎన్టీఆర్’ తో మూవీ స్టార్ట్ చేయనున్నాడట. ఇలా వరుస సినిమాలతో ఈ హీరో బిజీగా ఉన్నాడు. చూడబోతుంటే ఇండస్ట్రీలోని దర్శకులు ‘ఎన్టీఆర్’ కోసమే ఎదురుచూస్తునట్లున్నారు.

కాబట్టి కొరటాలతో 2025 లోనే ‘దేవర-2’ చిత్రం సాధ్యం కాదని నెటిజన్లు భావిస్తున్నారు. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం డిసెంబర్ లేదా జనవరి వరకు ‘దేవర-1’ షూటింగ్ పూర్తవ్వబోతుందట. ఒకవేళ దేవర-1 సూపర్ హిట్ అయితే పర్వాలేదు.. కానీ , హిట్ కాకుంటే ‘ఎన్టీఆర్’ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు!. అపుడు దర్శకుడు కొరటాల శివ దేవర-2 ప్లాన్ చేస్తాడా!. ఇలా రకరకాల సందేహాలు ఫాన్స్ లో తలెత్తనున్నాయి. ఇక “ఎన్టీఆర్ ” నటిస్తున్న ‘దేవర-1’ చిత్రం పైన అంచనాలు భారీగానే ఉన్నాయి. ఏదేమైనా 2025 లో వెంటనే ‘దేవర-2’ విడుదల చేయడం కొరటాలకు కష్టంగానే మారబోతుంది. మరి ఈ విషయం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి