iDreamPost

చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని!

Kodali Nani, Nara Chandrababu: వైఎస్సార్ సీపీలోని కీలక నేతల్లో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తరచూ సెన్షేషనల్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.

Kodali Nani, Nara Chandrababu: వైఎస్సార్ సీపీలోని కీలక నేతల్లో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఒకరు. అలానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తరచూ సెన్షేషనల్ కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా మరోసారి చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు కొడాలి నాని.

చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని!

ఏపీలో రాజకీయాలు చాలా హీట్ మీద ఉన్నాయి. ముఖ్యంగా దేశంలోని  ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడి రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగుతోన్నాయి. అధికార, విపక్షాల మధ్య జరిగే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కౌంటర్ కి రిటర్న్ పది కౌంటర్లు ఇచ్చేలా ఇక్కడి పార్టీలు ఉన్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య ఓ కురుక్షేత్రమే జరుగుతుందని చెప్పొచ్చు. టీడీపీ నేతలు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేస్తుండగా, వారికి ధీటుగా వైసీపీ నేతలు, మంత్రులు సమాధానాలు ఇస్తున్నారు. అలానే చంద్రబాబుపై వైసీపీలోని కొందరు నేతలు ఓ రేంజ్ లో  ఫైర్ అవుతుంటారు. తాజాగా మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని..చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు.

బుధవారం గుడివాడ నియోజక వర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి పరిపాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. మంచి జరిగితేనే నాకు ఓటు వెయ్యండి అని అడిగిన దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని నాని అన్నారు. అలానే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పుకునే గొప్ప మనస్సున నాయకుడు సీఎం జగన్ అంటూ కొడాలి నాని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో ప్రతిపక్ష టీడీపీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై  ఓ రేంజ్ లో మండిపడ్డాడు. ఆయనతో పాటు పవన్, పురందేశ్వరిలపై నాని సెటైర్లు వేశారు.

జగన్ పై ఒంటరిగా పోటీ చేసే దమ్ము చంద్రబాబు లేదని నాని విమర్శించారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం లేక ఒకపక్క దత్తపుత్రుడు, మరోపక్క ఉత్త పుత్రుడు, ముందు బీజేపీ వదినమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ చెల్లమ్మను వెనకాల నిలబెట్టుకొని ఎన్నికలకు వస్తున్నాడని నాని మండిపడ్డారు. చెల్లెమ్మ, వదినమ్మ, దత్తపుత్రుడుతో కలిసి చంద్రబాబు కుతంత్రాలకు తెరలేపాడని మండిపడ్డారు. వీళ్లందరూ ఉన్న కూడా బాబుకు ధైర్యం సరిపోక ఢిల్లీ లోని బీజేపీ పెద్దలను సైతం మభ్య పెడుతున్నాడని, అక్కడ ప్రధాని మోదీ, అమిత్ షా ఇచ్చిన ఆఫర్  దెబ్బకు బాబు మంచంపై పడ్డాడని, వారం నుంచి ఏపీకి రావడం లేదని ఎద్దేవా చేశారు.

ఢిల్లీలో బీజేపీ పెద్దలు ఇచ్చిన ఆఫర్ తో  చంద్రబాబు అయోమయ స్థితిలో పడిపోయారని నాని అన్నారు. ఢిల్లీ పెద్దలు ఇచ్చిన ఆఫర్ ను కాదని అంటే ఒక సమస్యా, అవునని అంటే మరో సమస్య, ఇలా చంద్రబాబు పరిస్థితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిలా మారిందన్నారు. సీఎం జగన్ ఓడిస్తానంటూ ప్రగల్భాలు పలికే చంద్రబాబు బలం సరిపోక ఢిల్లీ వెళ్లారని ఆయన తెలిపారు. ఇదే సమయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై కూడా కొడాలి నాని సెటైర్లు వేశారు. హెలికాఫ్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేరా అని ప్రశ్నించారు. ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో పవన్ ..తన పర్యటనను వాయిదా వేసుకున్నారని తెలిపారు. జనంలోకి వెళ్తే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భఘయంతో పవన్ డ్రామా ఆడుతున్నాడని నాని మండిపడ్డారు. మరి..చంద్రబాబుపై నాని చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి