iDreamPost

ఆ కారణంతో అంబర్ పేట్ నుంచి పోటీ చేయని కిషన్ రెడ్డి!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్నాయి. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు కిషన్ రెడ్డి పేరు లేదు. అంతేకాక ఆయన పోటీ చేస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ప్రకటించారు.

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోన్నాయి. తాజాగా బీజేపీ ప్రకటించిన జాబితాలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు కిషన్ రెడ్డి పేరు లేదు. అంతేకాక ఆయన పోటీ చేస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ప్రకటించారు.

ఆ కారణంతో అంబర్ పేట్ నుంచి పోటీ చేయని కిషన్ రెడ్డి!

తెలంగాణలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నెల 30న జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తో పాటు ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తున్నాయి. బీజేపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. ఈ మూడో జాబితా అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా కేంద్ర పర్యాటకశాఖ మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షడు కిషన్ రెడ్డి పేరు లేదు. అంతేకాక ఆయన పోటీ చేస్తున్న అంబర్ పేట్ నియోజకవర్గంలో కొత్త అభ్యర్థిని ప్రకటించారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయని పొలిటికల్ సర్కిల్ టాక్ వినిపిస్తోంది.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. బీజేపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని వ్యూహాలను రచిస్తోంది. ఈ క్రమంలో నేడు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల మూడో జాబితాను విడుదల చేసింది. తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 35 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను విడుదల చేశారు. మూడో జాబితాతో ఇప్పటి వరకు 88 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. కాగా ఇంకా 31 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి.

ఇది ఇలా ఉంటే మూడో జాబితాలో వచ్చిన ఓ అసెంబ్లీ నియోజకవర్గం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. అదే అంబర్ పేట్ నియోజకవర్గం. తాజాగా జాబితాలో అంబర్ పేట్ బీజేపీ అభ్యర్థిగా కృష్ణ యాదవ్ పేరును ప్రకటించారు. ఈ స్థానం నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పోటీ చేస్తారని అందరు భావించారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తో.. కొత్త అభ్యర్థి పేరును బీజేపీ అధినాయకత్వం ప్రకటించింది. అయితే కిషన్ రెడ్డిని తప్పించి.. మరో అభ్యర్థిని  ప్రకటించడం బీజేపీ వ్యూహమేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. కిషన్ రెడ్డి.. రాష్ట్రమంతట ఉన్న నియోజవర్గాలపై ఫోకస్ చేయాలనే.. ఆయనను పోటీ నుంచి తప్పించారని టాక్ వినిపిస్తోంది.

అంతేకాక రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఆయనను పోటీ చేయించేందుకు ఈసారి ఇవ్వలేదని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా బీజేపీ అసెంబ్లీ ఎన్నికల కంటే.. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ చేసిందని, అందుకే సీనియర్లకు, పలువురు కీలక నేతలను అసెంబ్లీ ఎన్నికలకు దూరంగా ఉంచినట్లు పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి.. కిషన్ రెడ్డిని అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి