iDreamPost

కష్టకాలంలో నడిచెల్లే కూలీలకు ఎదురొచ్చిన ఏపీ సీఎస్..

కష్టకాలంలో నడిచెల్లే కూలీలకు ఎదురొచ్చిన ఏపీ సీఎస్..

వచ్చే జూన్ 30 న పదవీ విరమణ చేయాల్సిన ఏపీ సీఎస్ నీలం సాహ్ని పదవీ కాలం మరో ఆరు నెలలు పొడిగించమని ఏపీ ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖ రాసినప్పుడు ఎందుకు ఫలానా అధికారిని పొడిగించమని లేఖ రాసేంతగా ప్రభావితమయ్యే పనితీరు నీలం సాహ్ని ఎం కనపరిచిందా అని విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని చెప్పొచ్చు . జగన్ తీరుతో వేగలేకపోతున్న సీఎస్ సెలవు పై వెళ్లబోతుంది అని ప్రచారం చేసిన టీడీపీ నేతలు కూడా ఈ ఘటనతో పునరాలోచనలో పడ్డారు అని చెప్పొచ్చు . ఇదిగో ఈ సంఘటనతో వారి ప్రశ్నలకు సమాధానం దొరికింది అని చెప్పొచ్చు .

నిన్న తాడేపల్లిలో సీఎం జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం విజయవాడ తిరిగి వెళ్తున్న సీఎస్ సాహ్నికి జాతీయ రహదారి పై వందలాదిగా నడిచి వెళ్తున్న వలస కూలీలు కంటపడ్డారు . తన వాహనం దిగి వారి వివరాలు తెలుసుకొన్న సీఎస్ చెన్నై నుండి బీహార్ నడిచివెళ్తున్నారు అని తెలియగానే వారి కష్టానికి చలించిపోయారు . వెంటనే గుంటూరు , కృష్ణా జిల్లాల కలెక్టర్లకి ఫోన్ చేసి తక్షణం వారికి ఆశ్రయం కల్పించి తరువాత శ్రామిక్ రైళ్లలో వారి స్వస్తలాలకు తరలించే ఏర్పాట్లు చేయమని ఆదేశించారు .

దరిమిలా వారిని ప్రత్యేక బస్సుల్లో విజయవాడ పునరావాస కేంద్రానికి తరలించిన అధికారులు మొత్తం 220 మంది వలస కూలీలకు ఆశ్రయం కల్పించి వారి స్వస్తలాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు .

బహుశా ఈ సేవాభావాన్ని , సామాన్యుల పట్ల ఆపేక్ష , ఆదరణల తీరుని చూసేనేమో సంక్షేమ కార్యక్రమాలతో సామాన్య ప్రజలకు దగ్గరైన వైసీపీ ప్రభుత్వానికి తగ్గ చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని అనే ఉద్దేశంతో జగన్ పొడిగింపు కోరి ఉండొచ్చు అని సీనియర్ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి