iDreamPost

ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ.. విడిచి ఉండలేక..!

పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి, యువకుడు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. కానీ, వీరి పెళ్లిలు ఒప్పుకోరని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

పైన ఫోటోలో కనిపిస్తున్న యువతి, యువకుడు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. కానీ, వీరి పెళ్లిలు ఒప్పుకోరని తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

ఒకరంటే ఒకరికి చచ్చేంత ప్రేమ.. విడిచి ఉండలేక..!

ఈ రోజుల్లో చాలా మంది యువతి, యువకులు తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. చదువును పక్కనబెట్టి ఇదే జీవితమనుకుంటున్నారు. ఇక చివరికి ప్రేమించిన వారితోనే ఉండాలని భావించి పెద్దలను ఎదురించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, అచ్చం ఇలాగే పెళ్లి చేసుకోవాలని అనుకున్న ఓ ప్రేమ జంట పెద్దలు ఒప్పుకోలేదని చివరికి సంచలన నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఈ ప్రేమికుల తల్లిదండ్రులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మ జిల్లా వైరాలోని బోనకల్ మండలం రాపల్లికి చెందిన చింతల సుమంత్ (18) అనే యువకుడు స్థానికంగా ట్రాక్టర్ డ్రైవర్ గా పని చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇతనికి బ్రాహ్మణపల్లికి చెందిన దారగాని ఐశ్వర్య (17) అనే అమ్మాయి పరిచయం అయింది. ఈ పరిచయం కాస్త రాను రాను ఇద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో వీళ్లిద్దరు గత ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటూ ఉన్నారు. ఇదే విషయం గతంలో యువతి తల్లిదండ్రులకు తెలియడంతో ఇద్దరినీ మందలించారు. అప్పటి నుంచి వీళ్లు సైలెంట్ గా ఉంటున్నారని అందరూ అనుకున్నారు. కానీ, అది జరగలేదు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోవడంతో ఫొన్ లో తరుచు మాట్లాడుకునేరు. ఇకపోతే, గతంలో హైదరాబాద్ వెళ్లిన సుమంత్.. అక్కడే ఓ కంపెనీలో పని చేస్తూ ఉండేవాడు.

ఇదిలా ఉంటే.. ఈ నెల 29న ఐశ్వర్య హైదరాబాద్ ఓ ఉన్న ప్రియుడు సుమంత్ వద్దకు వెళ్లింది. బతికుండగా మన పెద్దలు మనల్ని కలిసి ఉండనివ్వరని అనుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి వైరాకు చేరుకుని స్థానికంగా ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ నెల 29న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఐశ్వర్య తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిండ్రులు అంతటా వెతికారు. అయినా కూతురి ఆచూకి మాత్రం దొరకలేదు. ఇక చేసేదేం లేక స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే వీరు ఆత్మహత్య చేసుకున్న విషయం పోలీసులకు దృష్టికి వెళ్లింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి