iDreamPost

జ్యుడిషియల్ సిబ్బందికి హైకోర్టు జడ్జీల కీలక సూచనలు!

జ్యుడిషియల్ సిబ్బందికి హైకోర్టు జడ్జీల కీలక సూచనలు!

మన దేశంలో న్యాయ వ్యవస్థ పనితీరు గురించి అందరికి తెలిసిందే.  జిల్లా కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వేల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇవ్వన్నీ పూర్తి అయ్యే సరికి ఏళ్లకు ఏళ్లు పడుతుందని ఇప్పటికే న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు.  ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. కోర్టులు, న్యాయమూర్తులు, ఇతర సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం వంటి ఇతర కారణాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే పలు చోట్ల నూతన కోర్టు నిర్మాణాలు జరగుతుండగా, మరికొన్ని ప్రాంతాల్లో నిర్మాణం పూర్తి అయ్యే ప్రారంభమవుతున్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో అదనపు సీనియర్ సివిల్ జడ్జి  కోర్టును  హైకోర్టు న్యాయమూర్తు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు జ్యూడిషియల్ సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు.

విజయనగరం జిల్లాలో కొత్తగా ఏర్పాటైన న్యాయస్థానాల ద్వారా ప్రజలకు సత్వర న్యాయం అందాలని హైకోర్టు న్యాయమూర్తులు కోరుకున్నారు.  ఈ దిశగా న్యాయాధికారులు, న్యాయవాదులు  కృషి చేయాలని వారు పిలుపు నిచ్చారు.  ఆదివారం విజయనగరం జిల్లా న్యాయస్థానాల సముదాయంలో కొత్తగా మంజురైన అదనపు సీనియర్ సివిల్ కోర్టుని హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ కె. శ్రీనివాస రెడ్డి, జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ చీకటి మానవనేంద్రనాథ్ రాయ్,  జస్టిస్  ఉపమాక దుర్గా ప్రసాదరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ పాల్గొన్నారు.

యువ న్యాయవాదులకు తగిన శిక్షణ ఇచ్చి మెరికల్లాంటి లాయర్లను అందించాలని సీనియర్ న్యాయవాదులకు  జస్టిస్ ఏవీ శేషసాయి సూచించారు. లాయర్లు, జడ్జీలు పరస్పరం గౌరవించుకోవడం ద్వారా సమాజానికి మేలు చేయగలమని ఆయన తెలిపారు. జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ.. జిల్లా కోర్టు భవన సముదాయాలకు రూ.99 కోట్లతో మంజూరైన కొత్త భవనాలను నాణ్యతగా  నిర్మించేలా బార్ కౌన్సిల్, ఇతర సిబ్బంది జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో  జిల్లా జడ్జి, పలువురు అధికారులు పాల్గొన్నారు. మరి.. హైకోర్టు న్యాయమూర్తులు చేసిన ఈ సూచినలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

ఇదీ చదవండి:ఎస్సీలకు సాయం అందించడంలో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ ప్రభుత్వం​!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి