iDreamPost

నంద్యాల ఉప ఎన్నిక విషయం వెలుగులోకి తెచ్చిన నాని ట్వీట్ – ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర రావ్ రీట్వీట్

నంద్యాల ఉప ఎన్నిక విషయం వెలుగులోకి తెచ్చిన నాని ట్వీట్ – ఇంటెలిజెన్స్ వెంకటేశ్వర రావ్ రీట్వీట్

విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని, సస్పెండ్‌కు గురైన ఏబీ వెంకటేశ్వరరావుకు మధ్య ట్విట్టర్‌ వార్‌ కొనసాగుతోంది. ఒకరి గుట్టును ఒకరు బయటపెట్టుకుంటూ కొత్త అనుమానాలకు అవకాశం కల్పిస్తున్నారు. భద్రతా పరికరాల కొనుగోలు విషయంలో దేశ భద్రతకు భంగం కలిగించారనే ఆరోపణలతో మాజీ ఇంటలిజెన్స్‌ చీఫ్‌ ఏబీ వెంకటేశ్వరరావును ప్రభుత్వం సస్పెండ్‌ చేసిన విషయం తెలిసిందే.

దీనిపై ఎంపీ కేశినేని నాని ఉదయాన్నే ట్వీట్‌ చేస్తూ.. మీరు ముఖ్యమంత్రి అవడానికి, మీ పార్టీ అధికారంలోకి రావడానికి, తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిని సన్మానిస్తారనుకుంటే సస్పెండ్‌ చేశారేంటి? జగన్‌మోహన్‌రెడ్డిగారు’’అంటూ కామెంట్‌ చేశారు. దీనికి వెంకటేశ్వరరావు స్పందిస్తూ.. మీరూ మీరూ బాగానే పార్లమెంటులో బాగానే ఉంటారుగా. అందరూ కలసి ఒక అభిప్రాయానికి రండి. నేను వృత్తి ధర్మం నిర్వర్తించానో లేక ఇంకేమైనా చేశానో అంటూ రీ ట్వీట్‌ చేశారు. అలాగే నంద్యాల ఉప ఎన్నికలను ప్రస్తావిస్తూ.. ‘‘ఏమిటోనండీ ఎంపీ గారు.. మీరేమో ఇలా అంటారు. మరి నంద్యాల ఉప ఎన్నికల్లో గెలవడానికి నేనే కారణమని అంబటి రాంబాబుగారు అప్పట్లో నవ్వించారు. అంటూ మరో రీ ట్వీట్‌ చేశారు.

ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న ప్రజలకు కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు వీరిద్దరికీ ఎక్కడ గొడవ మొదలయ్యింది అని ఆరా తీస్తున్నారు. అయితే 2019 ఎన్నికల సమయంలో కేశినేనికి టికెట్‌ ఇవ్వకూడదని చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరావు చెప్పారని, కేశినేనికి వ్యతిరేకంగా ఫిర్యాదులు చేశారని తెలుస్తోంది. తప్పనిసరి పరిస్థితుల్లో కేశినేనికే టికెట్‌ వచ్చింది. అప్పుడు చేసిన ఫిర్యాదులను కేశినేని మనసులో పెట్టుకొని.. ఇప్పుడు అవకాశం రాగానే ఎగతాళి చేస్తున్నారని అనుకుంటున్నారు.

చిన్న చిన్న విషయాలకే అంతెత్తున స్పందించే చంద్రబాబు.. తనకు ఎంతో దగ్గరైన ఏబీ వెంకటేశ్వరరావు సస్పెండ్‌కు గురిఅయినా మాట్లాడకపోవడం ఆసక్తిగా మారింది. ఇది భద్రతా వ్యవహారం కాబట్టి.. ఇందులో జోక్యం చేసుకుని మాట్లాడితే తనకూ ముప్పు వస్తుందని భావించి చంద్రబాబు సైలెంటుగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి