iDreamPost

కిరాణ కొట్టుల్లో అమ్మే ప‌ప్పులు, బియ్యంలాంటి వ‌స్తువుల‌పై జీఎస్టీ ఉండదు, కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కిరాణ కొట్టుల్లో అమ్మే ప‌ప్పులు, బియ్యంలాంటి వ‌స్తువుల‌పై జీఎస్టీ ఉండదు, కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం తాజాగా జీఎస్టీలో మార్పులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బియ్యం, గోధుములు, ప్పు ధాన్యాలు, తృణధాన్యాలు వంటి ఆహార పదార్థాలు, మరికొన్ని ప్యాకేజింగ్ వస్తువులపై 5శాతం జీఎస్టీ విధించాలనే నిర్ణయాన్ని ప్రకటించింది. దీనిపై కేరళ ప్రభుత్వం ముందుడుగు వేస్తూ కొత్త నిర్ణయం తీసుకుంది.

కేరళలోని చిన్న దుకాణాలు, కుటుంబశ్రీ పేరుతో నడుస్తున్న సహాయక బృందాల వ్యవస్థను బలోపేతం చేసేందుకు వాళ్ళు విక్రయించే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించమని ప్రకటించింది. కుటుంబశ్రీ, ఇతర సంస్థలు 1 లేదా 2 కిలోలతో విక్రయించే లూజ్ ప్యాకెట్లు, వస్తువులపై పన్ను విధించబోమని కేరళ ఆర్థిక మంత్రి బాలగోపాల్ మంగళవారం కేరళ అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయంలో రాజీ పడేందుకు మేం సిద్ధంగా లేమని అన్నారు.

కేరళలో ఆ ప్రభుత్వానికే చెందిన కుటుంబశ్రీ అనే మహిళా స్వయం సహాయక బృందం ఉంది. దీన్ని దేశంలోనే ప్రముఖ మహిళా సాధికారత పథకాల్లో ఒకటిగా పరిగణిస్తారు. వీటిల్లో చిన్న స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయి.

కేరళ ప్రభుత్వం ఈ అంశంపై ఇప్పటికే కేంద్రానికి రెండు లేఖలు రాసింది. ఏదేమైనా ఈ విషయంలో చిరు వ్యాపారులను పరిగణనలోకి తీసుకుంటామని, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకావని, వారిపై ప్రభావం చూపే విధంగా తాము అమలు చేయబోమని అన్నారు.

బ్రాండెడ్ కంపెనీలు మాత్రం ప్యాకేజ్డ్ ఉత్పత్తులపై 5శాతం పన్ను చెల్లించాల్సి ఉన్నప్పటికీ, వారు తమ బ్రాండును క్లెయిమ్ చేయడం లేదని ప్యాకేజింగ్ పై పేర్కొనే సందర్బంలో దానిపై పన్ను విధించబోమని తెలిపారు బాలగోపాల్.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి