iDreamPost

తెలంగాణ ఆశా వర్కర్లకు KCR సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌!

  • Published Jul 08, 2023 | 12:32 PMUpdated Jul 08, 2023 | 12:32 PM
  • Published Jul 08, 2023 | 12:32 PMUpdated Jul 08, 2023 | 12:32 PM
తెలంగాణ ఆశా వర్కర్లకు KCR సర్కార్‌ మరో గుడ్‌ న్యూస్‌!

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్‌ సర్కార్‌ కృషి చేస్తోంది. వృద్ధులు, వికలాంగులు, కల్లు గీత కార్మికుల ఇలా విభిన్న వర్గాల వారికి మద్దతుగా నిలబడటం కోసం ఆసరా పెన్షన్లు, పేదింటి ఆడపిల్లల పెళ్లి కోసం ఆర్థిక సాయం, కుల వృత్తులను బతికించడం కోసం సామాజిక వర్గాల వారిగా.. వారికి ఆయా ఉత్పత్తులను అందజేయడం, దళితుల అభివృద్ధి కోసం దళిత బంధు, రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా వంటి కార్యక్రమాలను తీసుకువచ్చారు. అలానే ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం కోసం బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయడమే కాక ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాలు అభివద్ధి చేస్తోంది.

అంతేకాక గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో ప్రసవాలను ప్రోత్సాహించడం కోసం కేసీఆర్‌ కిట్‌, నగదు అందజేస్తోన్న సంగతి తెలిసిందే. అలానే అధికారంలోకి రాగానే అంగన్‌వాడీ టీచర్ల వేతనాలు పెంచారు కేసీఆర్‌. ఇక తాజాగా రాష్ట్రంలో ఉన్న ఆశా వర్కర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది కేసీఆర్‌ సర్కార్‌. రాష్ట్రంలో పని చేస్తున్న ఆశా వర్కర్ల సెల్‌ఫోన్‌ బిల్లులను ప్రభుత్వమే చెల్లించనుంది.

తెలంగాణలోని 27 వేల మంది ఆశా కార్యకర్తలకు కేసీఆర్‌ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. జులై నుంచి ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఆశా వర్కర్ల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా శుక్రవారం మంత్రి హరీశ్‌ రావు ఈ ప్రకటన చేశారు. ఆశ వర్కర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా పనిచేయాలని హరీశ్ రావు సూచించారు. దేశవ్యాప్తంగా చూసుకుంటే.. తెలంగాణలోనే ఆశావర్కర్లకు అత్యధిక వేతనం ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. గత ప్రభుత్వాలు ఆశా వర్కర్ల గురించి పట్టించుకోలేదన్నారు. అన్ని వర్గాల ప్రజల గురించి ఆలోచించి అనేక సంక్షేమ కార్యక్రమాలను కేసీఆర్ సర్కారు తీసుకొచ్చిందని మంత్రి తెలిపారు.

ప్రభుత్వం చేస్తున్న మంచిని ఆశా వర్కర్లు ప్రజలకు చెప్పాలని సూచించారు మంత్రి హరీశ్ రావు. టి డయాగ్నోస్టిక్స్ ద్వారా ప్రజలకు ఉచిత చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఆశ వర్కర్‌పై 50 వేలు ఖర్చు పెట్టి శిక్షణ ఇచ్చి ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చి దిద్దుతామని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్‌ ప్రభుత్వం రాకముందు డెలివరీలు ప్రైవేట్, ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం, 30 శాతంగా ఉండేవని.. ఇప్పుడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే 70 శాతం డెలివరీలు జరుగుతున్నాయని మంత్రి హరీశ్ రావు తెలిపారు. న్యూట్రిషన్ కిట్ ద్వారా గర్భంతో ఉన్న మహిళలకు బలవర్ధక ఆహారం అందిస్తోందని తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి