iDreamPost

OTTలో అదరగొడుతున్న ‘కథ వెనుక కథ’! రివ్యూ

  • Published Mar 30, 2024 | 12:01 PMUpdated Apr 01, 2024 | 4:30 PM

సునీల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ వెనుక క‌థ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ప్రేక్షకులకు థ్రిల్ కు గురిచేస్తుంది. ఎంతో ఆసక్తి మంచి కథతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

సునీల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా కీల‌క పాత్ర‌లో న‌టించిన తెలుగు స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ క‌థ వెనుక క‌థ సినిమా ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా, ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ప్రేక్షకులకు థ్రిల్ కు గురిచేస్తుంది. ఎంతో ఆసక్తి మంచి కథతో తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో దూసుకుపోతుంది.

  • Published Mar 30, 2024 | 12:01 PMUpdated Apr 01, 2024 | 4:30 PM
OTTలో అదరగొడుతున్న ‘కథ వెనుక కథ’! రివ్యూ

మంచి కథ, కథనం ఉంటే పెద్ద సినిమా, చిన్న సినిమా అనే తేడా లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తుంటారు. అందులోనా సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్స్‌ను మరింత ఇష్టపడుతుంటారు. ఇటీవలే ఓటీటీలో విడుదలైన ‘కథ వెనుక కథ’ కూడా అంతే… ఈటీవీ విన్ లో విడుదలైన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యంగ్ డైరెక్టర్ కృష్ణ చైతన్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ హీరో విశ్వంత్ దుడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభశ్రీ, ఆలీ, సునీల్, జయప్రకాశ్, బెనర్జీ, రఘుబాబు, సత్యం రాజేష్, మధునందన్, భూపాల్, ఛత్రపతి శేఖర్, ఖయ్యుం, రూప తదితరులు నటించారు. అవనీంద్రకుమార్ నిర్మించారు. ఓటీటీలో రిలీజ్‌ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది.

కథ విషయానికి వస్తే.. ఒక క్రైమ్ సన్నివేశంతో కథ మొదలవుతుంది. సిటీలో అమ్మాయిలు మిస్ అవ్వడం.. ఎంక్వయిరీ కోసం స్పెషల్ ఆఫీసర్ రావడం, దర్శకుడు కావాలనే ప్రయత్నాలు చేసే హీరోకి సినిమా అవకాశం రావడం, అవకాశాలతో పాటే సమస్యలు చుట్టుముట్టడం.. ఒక పక్క ఎంక్వయిరీ, మరోపక్క క్రైమ్ జరగడం.. ఇలా వరుస సస్పెన్స్ క్రైమ్ సీక్వెన్స్ లతోనే సినిమా పరుగులు పెడుతుంది. కథనంలో చాలా ప్రశ్నలు ప్రేక్షకుడుకి వదిలేసి, హీరో దర్శకత్వం చేస్తున్న సినిమాకి సంబంధించి ఒక ట్విస్ట్‌తో ఇంటర్వల్ వస్తుంది. మొదటి 20 నిమిషాలు సినిమా కాస్తా నెమ్మదిగా నడిచినా.. మధ్యలో ఐటం సాంగ్‌ కాస్త ఇబ్బంది పెట్టినా… చాలావరకు ఇంట్రస్ట్ గానే మూవీ సాగుతుంది. ఇక సెకెండ్ హాఫ్ మొదలైన కథనంలో స్పీడ్‌ పెరుగుతుంది. ఎప్పటికప్పుడు క్రైమ్ ఎవరు చేశారు? ఎందుకు చేసారు? అనే పాయింట్స్‌తో ఇంట్రెస్టింగ్‌ కథ నడిచింది. ఫస్ట్ హాఫ్ లో వదిలిన ప్రశ్నలకు సెకెండాఫ్ ఆఖరి 30 నిమిషాలు దర్శకుడు ఇచ్చిన సమాధానాలు, ఒకదాని తరువాత ఒకటి వచ్చే ట్విస్ట్ లు ప్రేక్షకులను థ్రిల్‌కు గురిచేస్తాయి. ప్రధానమైన పాత్రల చట్టు నడిపిన కథనం బాగుంది. చాలావరకు కథని సస్పెన్స్ గా నడపడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఎక్కడా తడబడకుండా ట్విస్ట్ లు ఓపెన్ చేసిన విధానం బాగుంది. మేనమామ మేనల్లుడు బాగుపడాలని కోరుకుంటాడు. కానీ అల్లుడిగా మాత్రం బాగా ఉన్నోడే రావాలనుకుంటాడు. వేటగాడు వెయిట్ చేయకూడదు వేటాడాలి. మర్డర్లు రేపులు చేస్తే కత్తి ఎత్తుతారు చేతులెత్తి చప్పట్లు కొట్టరు. ఏ తండ్రి కైనా కొడుకు సగం బలం.. కూతురు సగం ప్రాణం. ఇలాంటి డైలాగ్ లు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

రెండు గంటలు నిడివి ఉన్న సినిమాలో ఫస్ట్ హాఫ్ మొదటి 20 నిమిషాలు కాస్తా నెమ్మదిగా ఉంది. మధ్యలో వచ్చే ఐటం సాంగ్ ఎందుకు సినిమాలో ఫిట్‌ కాలేదు. సినిమాలోని మెయిన్‌ పాయింట్‌తో అసలు కథ మొదలైన తర్వాత.. ఎక్కడా బోర్‌ కొట్టదు. క్రైమ్, సస్పెన్స్ సినిమాలు ఇష్టపడే వాళ్లు ఈ సినిమాను హ్యాపీగా చూడొచ్చు. నటీనటులు విషయానికొస్తే… ఇందులో నటించిన హీరో అశ్విన్… దర్శకుడు కావాలనే తపన ఉన్న యువకుని పాత్రలో బాగా నటించాడు. ఓ వైపు కెరీర్… మరో వైపు ప్రేమించిన యువతిని సొంతం చేసుకోవాలన్న తపన ఉన్న ఓ బాధ్యతాయుతమైన యువకుని పాత్ర చాలా మందికి ఇన్స్ పిరేషన్ గా నిలుస్తుంది. ఇందులో కమెడియన్ సునీల్ క్యారెక్టర్ చాలా సర్ ప్రైజ్ ఇస్తుంది. వైవిధ్యమైన పాత్రలో సునీల్ కనిపించి మెప్పించాడు. సత్యం రాజేష్ తనదైన శైలిలో నటించి మెప్పించారు. సీనియర్ నటుడు జయప్రకాశ్ ఇందులో సినీ నిర్మాతగా నటించి మెప్పించారు. మిగతా పాత్రల్లో నటించిన రఘుబాబు, మధునందన్, భూపాల్, ఖయ్యుం తదితరులంతా తమతమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. సినిమా నిర్మాణ విలువలు కూడా చాలా ఉన్నతంగా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీకెండ్ లో మీ ఇంట్లోనే కూర్చొని… ఈ సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ మూవీని సరదాగా చూసేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి