iDreamPost

Japan Movie: జపాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు? ఎక్కడంటే..

ప్రముఖ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జపాన్‌’ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది...

ప్రముఖ హీరో కార్తీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘జపాన్‌’ సినిమా నవంబర్‌ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది...

Japan Movie: జపాన్‌ ఓటీటీ స్ట్రీమింగ్‌ డేట్‌ ఫిక్స్‌.. ఎప్పుడు? ఎక్కడంటే..

పేరుకు తమిళ హీరోనే అయినా.. తెలుగు చిత్ర పరిశ్రమకు దత్త పుత్రుడు అయ్యాడు కార్తీ​. తన విలక్షణమైన నటనతో, విభిన్నమైన ప్రాత్రలలో అలరిస్తూ అన్న సూర్యలాగే.. తమిళంతో సమానంగా తెలుగులోనూ సూపర్‌ క్రేజ్‌ తెచ్చుకున్నారు. తాజాగా, ఆయన జపాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో కార్తీకి జంటగా అను ఇమ్మాన్యుయేల్ నటించారు. ఈ మూవీ నవంబర్ 10న తమిళంతో పాటు, తెలుగులోనూ.. భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయింది. అయితే, ఆ అంచనాలను జపాన్‌ అందుకోలేకపోయింది.

ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవటంతో.. ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. నటన పరంగా కార్తీ తన పాత్రకు న్యాయం చేసి ప్రశంసలు పొందినా.. ప్రేక్షకులకు మాత్రం ఈ మూవీ అంతగా కనెక్ట్ కాలేదు. దీంతో థియేటర్ల నుంచి తొందరగానే వెళ్లిపోయింది. ఈ సినిమా విడుదలై నెలరోజులు గడవకముందే ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. జపాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జపాన్ సినిమా భారీ అంచనాలతో విడుదలై నిరాశ మిగిల్చిడంతో.. శరావేగంగా ఓటీటీలో విడుదలవ్వడానికి సిద్ధంగా ఉంది.

అయితే థియేట‌ర్ లో రిజ‌ల్ట్ ఎఫెక్ట్ వ‌ల్లే జ‌పాన్ మూవీ నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌చ్చేస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. తాజాగా ఈ సినిమాను డిసెంబర్ 11 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈ మూవీని ఓటీటీ హ‌క్కుల‌ను దాదాపు 20 కోట్ల‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ట్లు సమాచారం. అంతేకాకుండా జపాన్ సినిమా.. తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులోకి రానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. అయితే హిందీ వెర్షన్ గురించి మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు. జ‌పాన్ సినిమాకు రాజు మురుగ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇక సినిమా కథ విషయానికి వస్తే..

జపాన్ మూవీలో ముని(కార్తీ) ఒక గజదొంగ. ఈ హీరో బంగారంను దొంగతనం చేస్తూ.. ఆ డబ్బుతో జల్సాగా జీవిస్తుంటాడు. అలా ఓసారి హైదరాబాద్ లోని రాయల్ అనే నగల దుకాణం నుంచి రూ. 200 కోట్లు విలువ చేసే నగలను కొట్టేస్తాడు. ఆ బంగారు ఆభరణల దుకాణంలో తెలంగాణ హోమంత్రి సత్యమూర్తి (కేఎస్ రవికూమార్) షేర్ కూడా ఉంటుంది. దీంతో పోలీసులు ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. స్పెషల్ ఆఫీసర్స్ భవాని(విజయ్ మిల్టన్), శ్రీధర్ (సునీల్) ఈ కేసును చేధించడానికి రంగంలోకి దిగుతారు.

మరోవైపు కేరళ, కర్ణాటకలో పోలీసులు జపాన్ కోసం వెతుకుతుంటారు. అసలు జపాన్ దొంగగా మారడానికి కారణం ఏంటి ? అతను దోచుకున్న డబ్బు, బంగారం ఏం చేశాడు ? శ్రీధర్‌తో పాటు మరికొంత మంది పోలీసు అధికారులు జపాన్ కి ఎందుకు సహాయం చేశారు ? చివరకు జపాన్ జీవితం ఎలా ముగిసింది ? అన్న అంశం పై సినిమా నడుస్తుంది. ఆ వివరాలన్నీ తెలియాలంటే జపాన్ మూవీ ఓటీటీలో చూడాల్సిందే. మరి, కార్తీ జపాన్ మూవీ ఓటీటీలోకి రావటంపై మీ అభిప్రాయాలను ఏమిటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి