iDreamPost

తెరపైకి సరికొత్త డిమాండ్‌.. రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ. 5లక్షలు!

  • Published Feb 12, 2024 | 2:55 PMUpdated Feb 12, 2024 | 2:55 PM

వ్యవసాయం చేసే రైతును పెళ్లి చేసుకునే యువతులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. ఆవివరాలు..

వ్యవసాయం చేసే రైతును పెళ్లి చేసుకునే యువతులకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలనే డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. ఆవివరాలు..

  • Published Feb 12, 2024 | 2:55 PMUpdated Feb 12, 2024 | 2:55 PM
తెరపైకి సరికొత్త డిమాండ్‌.. రైతును పెళ్లి చేసుకునే అమ్మాయికి రూ. 5లక్షలు!

నేటి కాలంలో వివాహం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది. ఒకప్పుడు పెళ్లి చేసుకుంటే.. లైఫ్‌లో సెటిల్‌ అయినట్లు భావించారు. కానీ ఇప్పుడు మాత్రం.. జీవితంలో అన్నీ విధాలా సెటిల్‌ అయ్యాకే పెళ్లి చేసుకుంటాం అంటున్నారు. ఒకప్పుడు వివాహం చేసుకోవాలంటే అబ్బాయి మంచివాడు.. కుటుంబం మంచిది అయితే చాలు. మరి ఇప్పుడో.. పెళ్లి చేసుకోవాలంటే బోలేడు కండీషన్స్‌. ఫలానా జాబ్‌ చేసే వ్యక్తి మాత్రమే కావాలి.. అది కూడా తమకు నచ్చిన ప్రాంతంలోనే.. అలానే పెళ్లి చేసుకోబోయే వ్యక్తి కుటుంబానికి సంబంధించి కూడా ఎన్నో షరతులు పెడుతున్నారు యువతులు.

ఇక నేటి కాలంలో పెళ్లి చేసుకోవాలనుకునే యువతి, ఆమె తల్లిదండ్రులు ఉద్యోగం చేసే యువకులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉండి.. వ్యవసాయం చేసుకునే యువకులకు పెళ్లి జరగడం చాలా కష్టంగా మారింది. ఈక్రమంలో తాజాగా ఓ కొత్త డిమాండ్‌ తెర మీదకు వచ్చింది. వ్యవసాయం చేసే రైతును పెళ్లి చేసుకునే యువతులకు 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు యువ రైతులు. ఆ వివరాలు..

ఈ డిమాండ్‌ తెర మీదకు వచ్చింది మన దగ్గర కాదు.. కర్ణాటకలో. ఇప్పటికే అక్కడ అవివాహిత యువకులు.. అనేక సందర్భాల్లో తమ సమస్య గురించి కలెక్టర్‌, మంత్రులకు వినతి పత్రాలను ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కర్ణాటక బడ్జెట్‌ సమావేశాలకు ముందు సంప్రదింపుల కసరత్తులో భాగంగా సీఎం సిద్ధరామయ్య.. రైతు సంఘాల నేతలతో సమావేశం అయ్యారు. ఈ భేటీలో చాలా డిమాండ్లు వచ్చాయి. వాటిలో ముఖ్యమైంది రైతు యువకుడిని పెళ్లి చేసుకునే యువతికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలని రైతులు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కోరారు.

రాష్ట్రంలో ఎందరో యువకులు వ్యవసాయాన్ని నమ్ముకుని.. ఏటా లక్షల రూపాయాల ఆదాయాన్ని సంపాదిస్తున్నారు అని.. అయినా సరే వారికి వివాహాలు కావడం లేదని.. వ్యవసాయం చేసే యువకులను పెళ్లి చేసుకునేందుకు యువతులు ముందుకు రావడం లేదని తెలిపారు. ఫలితంగా 45 ఏళ్లు వస్తున్నా.. యువ రైతులకు పెళ్లి కావడం లేదని.. రైతు సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం రుణమాఫీతో పాటు.. రైతును వివాహం చేసుకునే యువతికి 5 లక్షల రూపాయల ప్రోత్సాహాన్ని ఇవ్వాలంటూ రైతు సంఘాల నాయకులు సిద్ధరామయ్యకు వినతి పత్రాన్ని అందించారు.

ఇక గతంలో కొందరు అవివాహిత యువకులు తమకు పెళ్లి కావడం లేదని.. ఈ సమస్యను పరిష్కరించాలంటూ కలెక్టర్‌కు వినతి పత్రం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఏకంగా రైతును పెళ్లి చేసుకుంటే 5 లక్షలు ఇవ్వాలనే డిమాండ్‌ తీసుకురావడం చూస్తే.. కర్ణాటకలో ఈ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి