iDreamPost

బింబిసార 3 రోజుల వసూళ్లు – అప్పుడే లాభాలు

బింబిసార 3 రోజుల వసూళ్లు – అప్పుడే లాభాలు

కళ్యాణ్ రామ్ హీరోగా వశిష్ట దర్శకత్వంలో రూపొందిన బింబిసార ఆశించిన దానికన్నా జెట్ స్పీడ్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా అతని కెరీర్ బెస్ట్ గా కొత్త రికార్డులు నెలకొల్పే దిశగా పరుగులు పెడుతోంది. సీతారామం సైతం పాజిటివ్ టాక్ తో పోటీ ఇస్తున్నప్పటికీ మాస్ ఆడియన్స్ పరంగా సపోర్ట్ బింబిసారకే ఎక్కువగా ఉంది. అందులోనూ పిల్లలను ఆకట్టుకునే అంశాలు ఇందులో పుష్కలంగా దట్టించడంతో ఆటోమేటిక్ గా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతు వచ్చేసింది. కేవలం మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ దాటేసి రెండు కోట్ల పైగా లాభాన్ని అందుకున్న మూవీగా బింబిసార ఈ మధ్య కాలంలో స్టార్లకే సాధ్యం కాని అరుదైన ఫీట్ సాధించింది.

ఇక కలెక్షన్ల విషయానికి వస్తే నైజామ్ 5 కోట్ల 72 లక్షలు, సీడెడ్ 3 కోట్ల 40 లక్షలు, ఉత్తరాంధ్ర 2 కోట్ల 30 లక్షలు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు కలిపి 1 కోటి 77 లక్షలు, గుంటూరు 1 కోటి 27 లక్షలు, కృష్ణా 90 లక్షలు, నెల్లూరు 50 లక్షలు రాబట్టింది. ఏపీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి సుమారుగా 15 కోట్ల 85 లక్షల షేర్ వచ్చింది. కర్ణాటకలో 1 కోటి 10 లక్షలు, ఓవర్సీస్ లో 1 కోటి 35 లక్షలతో అక్కడ మాత్రం జస్ట్ ఓకే పెర్ఫార్మన్స్ ఇచ్చింది. ఫైనల్ గా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీక్ ఎండ్ ని 18 కోట్ల 30 లక్షల షేర్ తో ఘనంగా ముగించింది. థియేట్రికల్ బిజినెస్ ని కేవలం 16 కోట్లలోపే చేయడం డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు ఇచ్చింది. అత్యాశకు పోని ఫలితం ఇది.

ఇంకా మొదటి వారం పూర్తి కాలేదు కాబట్టి రన్ బలంగా కొనసాగనుంది. వచ్చే వారం లాల్ సింగ్ చడ్డా, మాచర్ల నియోజకవర్గం, కార్తికేయ 2లు వస్తున్న నేపథ్యంలో వాటిలో ఉన్న కంటెంట్ అండ్ టాక్ ని బట్టి బింబిసార స్లో అవ్వడం కాకపోవడం ఆధారపడి ఉంది. ఇంకో నాలుగు రోజులు టైం ఉంది కనక వీక్ డేస్ ని క్యాష్ చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. దీనికి సీక్వెల్ ఆల్రెడీ ప్రకటించారు కాబట్టి త్వరలోనే స్క్రిప్ట్ పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. కాకపోతే టైం పట్టొచ్చు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న డెవిల్ పూర్తి చేశాక బింబిసార 2 వెంటనే ఉంటుందా లేక ఇంకా టైం పడుతుందా అనేది వేచి చూడాలి. ఇప్పటికైతే ఈ స్పీడ్ కు బ్రేకులు లేనట్టే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి