iDreamPost

‘కల్కి 2898 ఏడీ’ వాయిదా అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్!

  • Author singhj Published - 05:22 PM, Mon - 7 August 23
  • Author singhj Published - 05:22 PM, Mon - 7 August 23
‘కల్కి 2898 ఏడీ’ వాయిదా అంటూ వార్తలు.. క్లారిటీ ఇచ్చిన నాగ్ అశ్విన్!

రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాతి సినిమా కోసం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవల ‘ఆదిపురుష్​’తో ఆడియెన్స్​ను ఆయన పలకరించారు. అయితే ఈ సినిమా అంతగా మెప్పించలేదు. పైగా విమర్శలపాలై ప్రభాస్​కు లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టింది. దీంతో ఇకపై చేసే ఫిల్మ్స్ విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా ఉండాలని అనుకుంటున్నారట. ఆయన ప్రస్తుతం మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్​ తీస్తున్న ‘సలార్’, నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ‘కల్కీ 2898 ఏడీ’తో పాటు మారుతి మూవీ ‘రాజా డీలక్స్​’లో ప్రభాస్ యాక్ట్ చేస్తున్నారు.

పై మూడు చిత్రాల్లో ముందుగా ‘సలార్’ విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్​కు సంబంధించి మూవీ టీమ్ ప్లాన్స్ చేస్తోంది. అటు ‘కల్కి’తో పాటు ఇటు ‘రాజా డీలక్స్’ షూటింగ్ శరవేగంగా కొనసాగుతోందని తెలిసింది. అయితే ‘కల్కి’ చిత్రం విడుదల వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. ఒక ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ‘కల్కి చిత్రీకరణలో ఇంకా కొంతభాగం మిగిలి ఉంది. త్వరలోనే మొత్తం షూట్​ను పూర్తి చేస్తాం. నా ఫుల్ ఫోకస్ అంతా దీని పైనే ఉంది’ అని చెప్పుకొచ్చారు.

‘కల్కి’ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిన తర్వాత రిలీజ్ డేట్ గురించి ఆలోచిస్తామని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. ఒక మంచి రోజు చూసుకొని దీని గురించి ప్రకటన చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ మూవీలో అందరూ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారని.. ఇప్పటిదాకా ప్రభాస్​ ఇలాంటి లుక్​లో కనిపించలేదన్నారు నాగ్ అశ్విన్. అందుకోసమైనా ఆడియెన్స్ అందరూ ఈ సినిమా చూడాలన్నారు. థియేటర్​కు వచ్చిన ప్రేక్షకులు కొత్త అనుభూతి పొందుతారని నాగ్ అశ్విన్ వ్యాఖ్యానించారు.

ఇకపోతే, ‘కల్కి 2898 ఏడీ’ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడదుల చేస్తామని మేకర్స్ అప్పట్లో ప్రకటించారు. ఈ సినిమా రెండు పార్ట్​లుగా రానుందని టాక్ వినిపిస్తోంది. ఫస్ట్ పార్ట్​ను వచ్చే ఏడాది మే 9వ తేదీన రిలీజ్ చేయనున్నారని రూమర్స్ వస్తున్నాయి. ఇంకా షూటింగ్ పూర్తి చేసుకోని ఈ చిత్రం వీఎఫ్​ఎక్స్ వర్క్​కు కూడా చాలా టైమ్ పట్టేలా కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దర్శకుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇవ్వడం గమనార్హం. పాన్ ఇండియా స్టార్స్ కమల్ హాసన్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్​ ఇందులో కీలక పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన ‘కల్కి’ గ్లింప్స్​కు సూపర్బ్ రెస్పాన్స్ లభించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి