iDreamPost

Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది!

  • Published Apr 06, 2024 | 9:42 AMUpdated Apr 06, 2024 | 9:42 AM

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" పై ఇప్పుడు అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల డేట్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. తాజాగా కొత్త డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

ప్రభాస్ నటిస్తున్న "కల్కి 2898 ఎడి" పై ఇప్పుడు అందరికి భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో ఇప్పుడు ఈ సినిమా విడుదల డేట్ పై మళ్ళీ చర్చలు మొదలయ్యాయి. తాజాగా కొత్త డేట్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

  • Published Apr 06, 2024 | 9:42 AMUpdated Apr 06, 2024 | 9:42 AM
Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది!

రెబెల్ స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో .. భారీ అంచనాల మధ్యన రాబోతున్న సినిమా “కల్కి 2898 AD”. ఈ సినిమా కోసం ప్రభాస్ అభిమానులతో పాటు అందరూ చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి అప్ డేట్ ఎప్పటికపుడు వైరల్ అవుతూనే ఉంది. దీనితో రోజు రోజుకు కల్కిపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ సినిమా విడుదల తేదీ కూడా పోస్ట్ పోన్ అవుతూ.. ఎట్టకేలకు మే 9 రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు కొద్దీ రోజుల క్రితం వచ్చిన వార్తల ప్రకారం ఎలక్షన్స్ డేట్ రిలీజ్ చేయడంతో .. కల్కి సినిమా మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందంటూ.. చర్చలు జరిగాయి. దీనితో అభిమానులకు నిరాశ తప్పలేదు. ఈ క్రమంలో న్యూ రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు మేకర్స్ ఎక్కువ ఆలస్యం చేయకుండా .. ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

దేశ వ్యాప్తంగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.. ఆంధ్రప్రదేశ్ లో మే 13న పోలింగ్ జరగనుంది. అలాగే మే 7న కూడా పన్నెండు రాష్ట్రాలలో ఎన్నికల పోలింగ్ జరగనుందన్న సంగతి తెలిసిందే. ఇక ఎన్నికలు వస్తున్నాయంటే.. ఆ సమయాల్లో ఉండే నియమ నిబంధనల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీనితో మే 9న రిలీజ్ చేయాలనుకున్న కల్కి సినిమాను.. మూవీ కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని. పోస్ట్ పోన్ చేయాలనీ నిరణించుకున్నారు మేకర్స్. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాపై ఎలక్షన్స్ ప్రభావం పడకూడదనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనితో ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. “కల్కి 2898 AD” సినిమాను మే 30న విడుదల చేయనున్నట్లుగా.. అధికారికంగా ప్రకటించారు చిత్ర బృందం. దీనితో అభిమానులంతా ఖుషి అయిపోతున్నారు.

kalki

ఇక “కల్కి 2898 AD” చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్వనీదత్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అలానే ఈ సినిమా మొత్తం మూడు భాగాలుగా ఉండబోతున్న వార్తలు కూడా వింటూనే ఉన్నాం. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ హాఫ్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. సెకండ్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ పనులు జరుగుతున్నాయని సమాచారం. ఇటీవల మూవీ షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో.. ఇప్పుడు చాలా జాగ్రత్త పడుతున్నారు మేకర్స్. ఇక ఈ మూవీలో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్.. లాంటి భారీ తారాగణం ఉండబోతున్న సంగతి కూడా తెలిసిందే. కానీ, ఎవరెవరు ఏ ఏ పాత్రలలో ప్రేక్షకులను మెప్పిస్తారో వేచి చూడాలి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని.. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరి, వరుసగా కల్కి మూవీ గురించి వస్తున్న అప్ డేట్స్ పై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి