iDreamPost

పవన్‌తో కలిసి పోటీ చేసిన పార్టీలన్ని ఓడిపోయాయి: KA పాల్

పవన్‌తో కలిసి పోటీ చేసిన పార్టీలన్ని ఓడిపోయాయి: KA పాల్

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన రాజకీయాల్లో చాలా యాక్టీవ్ గా ఉంటూ… తనదైన శైలీలో స్పదిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అంశాలపై పాల్ మాట్లాడుతుంటారు. ముఖ్యంగా ఏపీలో చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ లపై తరచూ విరుచకపడుతుంటారు. సోమవారం ఏసీబీ కోర్టు, హైకోర్టు ఇచ్చిన తీర్పులను తాను ముందే ఊహించానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలానే పవన్ కల్యాణ్ ఐరన్ లెగ్ అని, ఆయనతో కలిసి పోటీ చేసిన వాళ్లు దారుణంగా ఓడిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలానే అవినీతిలో పుట్టిపెరిగిన చంద్రబాబు.. చివరికి దేవుడిని కూడా తనకు శత్రువుని చేసుకున్నారంటూ పాల్ వ్యాఖ్యానించారు.

సోమవారం విశాఖలో కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్ కొట్టేస్తారాన్ని తాను ఊహించిందేనని అన్నారు.  అలానే టీడీపీ పని అయిపోయిందని, అవినీతి చంద్రబాబు ఇప్పటికైన తన తప్పుల్ని ఒప్పుకోవాలని కేఏ పాల్ హితవు పలికారు. టీడీపీ వాళ్లు ప్రజా శాంతి పార్టీలో చేరితే మంచిదని, చంద్రబాబుకు హైకోర్టులో ఇవాళ బెయిల్‌ రాదని తానుముందే ఊహించానని అన్నారు. లోకేష్‌ ఢిల్లీలో ఎంత తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని, అలానే తన పాపాలతో దేవుడ్నిని కూడా చంద్రబాబు శత్రువుని చేసుకున్నారంటూ పాల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఆణిముత్యం కాదు.. పాపాల ముత్యం, అవినీతి ముత్యమని, ఆరు లక్షల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారనే విమర్శలు చంద్రబాబు మీద ఉన్నాయంటూ పాల్ దుయ్యబట్టారు.

చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్ పై  కూడా తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. గత ఎన్నికల్లో పవన్ తో కలిసి పోటీ చేసిన పార్టీలన్నీ దారుణంగా ఓడిపోయాయి. పవన్ కల్యాణ్ ది ఐరన్ లెగ్ అంటు వ్యాఖ్యలు చేశారు.వాటికి ఐదు శాతం ఓట్లు కూడా రాలేదని ఆయన అన్నారు. పవన్ కు ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు.. ఎవరూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదన్నారు. చంద్రబాబుకు పవన్‌ అమ్ముడుపోయారని, పవన్‌ అవినీతిపై సీబీఐ విచారణకు తాను డిమాండ్‌ చేస్తే.. తాను ఎన్డీయేలో ఉన్నానని పవన్‌ అంటున్నాడు అని పాల్‌ మండిపడ్డారు. మరి.. పవన్ కల్యాణ్, చంద్రబాబు నాయులపై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి