iDreamPost

TDP జెండా పవన్ మోస్తున్నారు.. Jr.NTR తెలివైన వారు: కేఏ పాల్

TDP జెండా పవన్ మోస్తున్నారు.. Jr.NTR తెలివైన వారు: కేఏ పాల్

ఏపీలో రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారిపోతున్నాయి. మాములుగానే ఏపీ రాజకీయాలు చాలా హాట్ హాట్ గా ఉంటాయి. అలాంటి చంద్రబాబు అరెస్ట్ తరువాత ఈ రాజకీయం మరింత వేడెక్కింది. గురువారం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ అయ్యారు. ఆ తరువాత ప్రెస్ మీట్ లో సంచలన కామెంట్స్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక పవన్ మాటలపై అధికార వైసీపీ నేతలు ఓ రేంజ్ లో విరుచుకపడుతున్నారు.  ఇప్పటి వరకు వేసుకున్న ముసుగును పవన్ తొలగించాడంటూ కామెంట్స్ చేశారు. పవన్ వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పందించాడు. టీడీపీ జెండాను మోయడానికే పవన్ ఉందని, జూనియర్ ఎన్టీఆర్ చాలా తెలివైన వారని కేఏ పాల్ వ్యాఖ్యనించారు.

శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పవన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. తెలుగు దేశం పార్టీ అజెండాను , జెండాను జనసేన అధినేత పవన్ కల్యాణ్ మోస్తున్నారని, అలాంటి వ్యక్తికి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు  వేయరని కేఏ పాల్ జోస్యం చెప్పారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న వైనం జనసేనకు భారీగా నష్టం కలిగిస్తుందని పాల్ అంటున్నారు. పవన్ తప్పు చేశారని కేఏ పాల్ చెబుతున్నారు. ఏపీలో చంద్రబాబు ఏమి చేశారని పవన్ మద్దతు ఇస్తున్నారని ప్రశ్నించారు.  టిడిపి నాయకులు బాబు రావాలని అంటున్నారని… అసలు బాబు ఎందుకు రావాలో చెప్పాలని ప్రశ్నించారు కేఏ పాల్.

విభజన ఏపీలో తొలి అవకాశం బాబుకు ఇస్తే… రాజధాని నిర్మాణం చేయలేక పోయారు. అలానే ఏపీకి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ భారీగా  అయినా తేలేక పోయారని అన్నారు. చంద్రబాబుకు స్టేలు, బెయిల్  తెచ్చుకోవడం ఎలాగో తెలియదా? అని పాల్ ప్రశఅనించారు. చంద్రబాబు అంబేద్కర్, మహాత్మా గాంధీ అంట.. లోకేష్ భగత్ సింగ్ అంటా అంటూ కేఏ పాల్ ఎద్దేవా చేశారు. ఆయనకు ఇలాంటి వాటిలో మంచి పట్టు ఉందని వైసీపీ లాంటి ప్రత్యేర్థి పార్టీలే అంగీకరిస్తాయని పాల్ అన్నారు. ప్రధాని తలచుకుంటే చంద్రబాబు నాయడుకి బెయిల్ వస్తుందని పాల్ అంటున్నారు.

పవన్ తప్పు చేశారని పాల్ చెబుతున్నారు. పవన్ తన పార్టీని సొంతంగా పోటీ చేయకుండా పొత్తుల పేరిట చంద్రబాబుతో స్నేహం చేస్తే జనాలు  ఎందుకు ఓట్లు వేస్తారని ఆయన ప్రశ్నించారు. పవన్, చంద్రబాబు వెంట ఉండి  తప్పు చేస్తే.. టీడీపీకి, చంద్రబాబుకు దూరంగా జరిరగిన జూనియర్ ఎన్టీర్ తెలివిగా వ్యవహరించారని పాల్ కితాబు ఇచ్చారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలు అందరూ తనతో కలిసి రావాలని కే ఏ పాల్ పిలుపునిచ్చారు. తాను పోరాటం చేస్తే అన్నీ భూ స్థాపితం అయిపోతాయని కేఏ పాల్ పేర్కొన్నారు. మరి.. కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి