iDreamPost

చంద్రబాబు సభలో Jr. NTR ఫ్లెక్సీల కలకం!

Jr. NTR: టీడీపీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంశం కలకం సృష్టిస్తోంది. టీడీపీకి సంబంధించిన ఏ  కార్యక్రమం జరిగిన ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఆ పార్టీ నిర్వహించే సభలో తారక్ ప్లెక్సీలు కనిపిస్తుంటాయి.

Jr. NTR: టీడీపీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంశం కలకం సృష్టిస్తోంది. టీడీపీకి సంబంధించిన ఏ  కార్యక్రమం జరిగిన ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఆ పార్టీ నిర్వహించే సభలో తారక్ ప్లెక్సీలు కనిపిస్తుంటాయి.

చంద్రబాబు సభలో Jr. NTR ఫ్లెక్సీల కలకం!

తెలుగు దేశం పార్టీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంశం కలకం సృష్టిస్తోంది. టీడీపీకి సంబంధించిన ఏ  కార్యక్రమం జరిగిన ఎన్టీఆర్ పేరు వినిపిస్తోంది. ఆ పార్టీ నిర్వహించే సభలో తారక్ ప్లెక్సీలు కనిపిస్తుంటాయి. గతంలోను నారా లోకేష్ పాదయాత్ర సందర్భంగా ఏపీలో పలు చోట్ల ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించాయి. ఎన్టీఆర్‌‌కు అనుకూలంగా, నారా లోకేశ్‌కు వ్యతిరేకంగా ఈ ఫ్లెక్సీలు ఉన్న సంగతి తెలిసిందే. అలానే ఒంగోలులో నారా లోకేశ్ పాదయాత్ర సందర్భంగా ‘అసలోడు వచ్చే వరకు కొసరోడికి పండగే’ అంటూ ఎన్టీఆర్ ఫొటోతో రూపొందిన ఫ్లెక్సీ వివాదాస్పదమైంది. తాజాగా తిరువురూలో నిర్వహిస్తున్న చంద్రబాబు సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకం సృష్టించాయి.

ఆదివారం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు లో చంద్రబాబు సభ జరుగుతుంది. ఈ సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపాయి. అంతేకా ఎన్టీఆర్ సీఎం అంటూ టీడీపీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ ఫోటో ఉన్న బ్యానర్లు, జెండాలతో వచ్చిన టీడీపీ కార్యకర్తలు తిరువురు సభలో  కనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటూ జెండాలపై రాశారు. ఇక తారక్ సీఎం అంటూ రాసిన జెండాలను లాక్కొన్న టీడీపీ నేతలు పక్కన పడేశారు. టీడీపీ నేతల తీరుపై తారక్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ఇలా ఉంటే టీడీపీ అధినేత చంద్రబాబుకు మరోషాక్ తగిలింది.

ntr flexi in babu meeting

ఆ పార్టీకి చెందిన ఎంపీ కేశినేని నాని.. పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నారు. తాజాగా కేశినేని భవన్ నుంచి టీడీపీ జెండాను విజయవాడ ఎంపీ నాని తొలగించారు. మరోవైపు చంద్రబాబు సభలో కేశినేని నాని కోసం టీడీపీ నేతలు ప్రత్యేకంగా కుర్చీని కేటాయించారు. ఈ మేరకు చంద్రబాబు సభకు రావాలని ఎంపీ కనక మేడలతో శనివారం కేశినేనికి రాయబారం పంపించారు. కాగా, చంద్రబాబు ఆహ్వానాన్ని, రాయబారాన్ని నాని పట్టించుకోలేదు. మరోవైపు చంద్రబాబు సభకు కేశినేని వర్గం, మద్దతుదారులు దూరంగా ఉన్నారు.

ఇక జూనియ్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. టీడీపీ ఏ మీటింగ్ జరిగిన తారక్ ఫ్లెక్సీలు కనిపిస్తుంటాయి. ఎన్టీఆర్ టీడీపీ బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అని పార్టీ శ్రేణుల్లో కొందరు కోరుకుంతుంటారు. అయితే పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవు. ముఖ్యంగా చంద్రబాబు, బాలకృష్ణ దీనికి సిద్ధంగా లేరని టాక్ వినిపిస్తోంది. గతంలో టీడీపీలో ఎన్టీఆర్ కొంత యాక్టివ్‌గా కనిపించినప్పటికీ, నారా లోకేశ్ కోసం నెమ్మదిగా ఎన్టీఆర్‌‌ను పక్కనబెట్టారు. ఈ క్రమంలోనే తరచూ టీడీపీ సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం రేపుతుంటాయి. మరి.. తాజాగా చంద్రబాబు సభలో ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కనిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి