iDreamPost

Bigg Boss: బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

బిగ్ బాస్ అల్లర్ల కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంంబధించి 2 కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

బిగ్ బాస్ అల్లర్ల కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పటివరకు ఈ ఘటనకు సంంబధించి 2 కేసుల్లో 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

Bigg Boss: బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఫినాలే డే రోజు జరిగిన బీభత్సం మాత్రం అందరినీ విస్మయానికి గురి చేసింది. ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవలు, దాడులు జరిగాయి. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ పేరిట పెద్ద విధ్వంసమే సృష్టించారు. అమర్ దీప్ కారు, గీతూ కారు, అశ్వినీ కార్లు ధ్వంసం అయ్యాయి. 6 ఆర్టీసీ బస్సులు పగలగొట్టారు. ఒక పోలీసులు వాహనంపై కూడా దాడి చేశారు. ఈ అల్లర్లకు సంబంధించి మొత్తం 2 కేసులు నమోదు కాగా.. 24 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా బిగ్ బాస్ నిర్వాహకులకు జూబ్లీహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు.

బిగ్ బాస్ అల్లర్లకు సంబంధించి పోలీసులు వేగంగా విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 24 మందిని అరెస్టు చేశారు. వారిలో బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కూడా ఉన్నాడు. అతనికి రెండ్రోజుల క్రితం నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. రూ.15 వేల చొప్పున రెండు షూరిటీలు కూడా తీసుకుంది. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్ వచ్చి సంతకం కూడా పెట్టాలంటూ ఆదేశించారు. ఈ కేసులో ప్రశాంత్ అరెస్టు అయిన తర్వాత బిగ్ బాస్ యాజమాన్యం వైపు చాలామంది వేలు చూపించారు. ఈ షోని రన్ చేస్తున్న వారిపై కూడా కేసులు పెట్టాలంటూ, అసలు ఆ షోని బ్యాన్ చేయాలంటూ డిమాండ్లు పెరిగిపోయాయి. తాజాగా జూబ్లీహిల్స్ పోలీసులు ఈ అల్లర్లకు సంబధించి బిగ్ బాస్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఆ గొడవలకు సంబంధించి వారిని వివరణ కోరారు. ఫినాలేకి అంత మంది ఫ్యాన్స్ వస్తారని తెలిసినప్పుడు ఎందుకు ముందే ఇంటిమేట్ చేయలేదని ప్రశ్నించారు. అంతమంది గుమిగూడి ఉంటారని తెలిసినప్పుడు ఎందుకు తగిన ఏర్పాట్లు చేయలేదంటూ ప్రశ్నించారు. నోటీసులకు సంబంధించి బిగ్ బాస్ యాజమాన్యం ఏ విధంగా స్పందింస్తుందో వేచి చూడాలి.

ఈ కేసులకు సంబంధించి ఇప్పటికీ నెట్టింట రచ్చ జరుగుతూనే ఉంది. ఆ రోజు ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ దాడులకు సంబంధించి నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఈ దాడులకు పల్లవి ప్రశాంత్ కారణం అంటుంటే.. ఇంకొందరు మాత్రం ఫ్యాన్స్ పేరుతో కొందరు సైకోలు ఈ దాడులు చేశారంటున్నారు. ఏది ఏమైనా కూడా ఫ్యానిజం పేరిట ఇలాంటి దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ వారిస్తున్నారు. ఈ బిగ్ బాస్ ఘటనను ఉదాహరణగా తీసుకుని ఇప్పటికైనా ఈ ఫ్యాన్ వార్స్ మానేయాలంటూ సూచిస్తున్నారు. ఇంక విన్నర్ పల్లవి ప్రశాంత్ మాత్రం ఇప్పుడిప్పుడే తన గెలుపును ఆస్వాదిస్తున్నట్లు కనిపిస్తున్నాడు. తాజాగా తన స్పై బ్యాచ్ ని కలిశాడు. శివాజీ, యావర్, బోలే షావలీలను కలిశాడు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఈ బిగ్ బాస్ అల్లర్ల కేసు ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. మరి బిగ్ బాస్ యాజమాన్యానికి పోలీసులు నోటీసులు జారీ చేయడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి