iDreamPost

Tollywood: Jr.NTR – రామ్ చరణ్ టఫ్ ఫైట్.. లైనప్ ఎవరిది బాగుంది?

  • Published Feb 07, 2024 | 7:19 PMUpdated Feb 07, 2024 | 7:19 PM

టాలీవుడ్ లో రాజమౌళి ప్రాజెక్టుల తర్వాత స్టార్ హీరోలు ఎవరు సరైన విజయాలు అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు వరుస సినిమాలతో బరిలోకి దిగుతున్న ఆ స్టార్స్ ఇద్దరి సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి.

టాలీవుడ్ లో రాజమౌళి ప్రాజెక్టుల తర్వాత స్టార్ హీరోలు ఎవరు సరైన విజయాలు అందుకోలేకపోయారు. మరి ఇప్పుడు వరుస సినిమాలతో బరిలోకి దిగుతున్న ఆ స్టార్స్ ఇద్దరి సినిమాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయనేది చూడాలి.

  • Published Feb 07, 2024 | 7:19 PMUpdated Feb 07, 2024 | 7:19 PM
Tollywood: Jr.NTR – రామ్ చరణ్ టఫ్ ఫైట్..  లైనప్ ఎవరిది బాగుంది?

రాజమౌళి ‘RRR’ మూవీ తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేయడమే కాకుండా, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను గ్లోబల్ స్టార్లను చేసింది. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. ‘కర్స్ అఫ్ రాజమౌళి’ అనే థియరీ ఈ గ్లోబల్ స్టార్ల అభిమానులను కాస్త కలవరపెడుతోంది. రాజమౌళి ప్రాజెక్టులు భారీ విజయాలను అందుకోవడం, స్టార్ లను సూపర్ స్టార్లుగా మార్చేయడం అందరికీ తెలిసిందే. కానీ, రాజమౌళి ప్రాజెక్టుల తర్వాత స్టార్ హీరోలు ఎవరూ సరైన విజయాలు అందుకోలేకపోయారు. ఏది ఏమైనప్పటికి మెగా, నందమూరి అభిమానుల్లో ఈ కలవరం చాలా తక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ హీరోలు ఎంచుకున్న పవర్ ప్యాకెడ్ లైనప్ అలా ఉంది మరి.

మొదటగా చరణ్ విషయానికి వస్తే క్రేజీ & స్టైలిష్ డైరెక్టర్ శంకర్, కార్తీక్ సుబ్బరాజ్ రైటర్ గా దిల్ రాజు నిర్మాణంలో ‘గేమ్ ఛేంజర్’ 2024లో విడుదలకు రెడీ అవుతోంది. చెర్రీ IASగా రాబోతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ, అంజలి, ఎస్ జే సూర్య, సునీల్, నాసర్ వంటి అగ్ర తారాగణంతో మరో క్రేజీ శంకర్ స్టైల్ మూవీగా బయటకు రానుంది. అదనంగా సాయి మాధవ్ బుర్రా రచనా సహకారం, కొరియోగ్రఫికి ప్రేమ్ రక్షిత్, జానీ మాస్టర్, ప్రభు దేవా, శాండీ మాస్టర్, బోస్కో మార్టిన్, గణేష్ ఆచార్య కొల్లబరేషన్.. అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచుతోంది. ఆ తర్వాత బుచ్చిబాబు, నార్తన్ దర్శకత్వంలో రానున్న చిత్రాలు కాస్త ఆలస్యమైనా, మాకు ఎలాంటి ఢోకా లేదంటున్నారు మెగా ఫాన్స్. గౌతమ్ తిన్ననూరి- చెర్రీ ప్రాజెక్ట్ షెల్వ్ అయిన విషయం తెలిసిందే.

ఇక తారక్ విషయానికి వస్తే, సక్సెఫుల్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవరాజు’గా ‘దేవర’తో 2024లోనే థియేటర్లలో కనపడటానికి సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే రీలీజ్ అయిన దేవర ఫస్ట్ లుక్స్, గ్లింప్స్ వీడియో అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ స్టార్ అట్రాక్షన్ అదనపు బలంగా మారాయి. అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరోసారి ఏ మాత్రం అంచనాలకు తగ్గకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ 155 కోట్ల భారీ అమౌంట్ తో ఈ చిత్ర డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత తారక్ బాలీవుడ్ మల్టీవర్స్ ‘వార్-2’ తో బాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గర అవ్వడమే కాకుండా, తెలుగు యాక్షన్ మసాలా ప్యాకెజీని పరిచయం చేయనున్నాడు. అయితే, ‘కర్స్ అఫ్ రాజమౌళి’ థియరీ ఈసారి పనిచేయదేమో అన్న రేంజ్ లో ఈ హీరోల లైనప్ సక్సెస్ అవుతుందో.. లేదో? అనేది తెలియాలి అంటే 2024 ఎండింగ్ వరకు వేచి చూడాల్సిందే. మరి.. కర్స్ ఆఫ్ రాజమౌళి థియరీపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి