iDreamPost

తారక్ 30 కోసం రంగం సిద్ధం..!

తారక్ 30 కోసం రంగం సిద్ధం..!

జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కాల్సిన ప్యాన్ ఇండియా మూవీ రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందాని ఫ్యాన్స్ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెయిట్ చేసే కొద్దీ ఆలస్యం అంతకంతా పెరుగుతూ పోవడంతో వాళ్ళ బాధ చూడలేకే టీమ్ ఇటీవల కొన్ని డిస్కషన్ స్టిల్స్ ని రిలీజ్ చేసింది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం అతి త్వరలో అంటే వచ్చే నెలలో తారక్ సెట్స్ లో అడుగు పెట్టడం దాదాపు కన్ఫర్మ్ అయినట్టే. గోవాలో ప్రస్తుతం లొకేషన్ల వేట జరుగుతోంది. వీటిని ఫైనల్ చేశాక ఎక్కడ నుంచి మొదలుపెట్టాలనే విషయంలో నిర్ణయం తీసుకోబోతున్నారు. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ ఈ నెలాఖరు నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేయబోతున్నారు.

Koratala Siva On His Collaboration With Jr NTR For 'NTR30': "There Will Be A Mass Overdose"

అన్నీ బాగానే ఉన్నాయి కానీ కీలకమైన హీరోయిన్ సెలక్షన్ మాత్రం ఇంకా కొలిక్కి రాలేదు. ప్రస్తుతానికి కొన్ని ఆప్షన్లైతే పెట్టుకున్నారు. మొదటిది అలియా భట్. ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చిన అలియా ఇంకో రెండు నెలల్లో అందుబాటులోకి రానుంది. ఆల్రెడీ తారక్ తో చేసేందుకు సుముఖంగా ఉన్నానని మీడియా ముందే చెప్పింది కాబట్టి ఒకవేళ షూటింగ్స్ లో పాల్గొనేందుకు ఆరోగ్యం అనుకూలంగా ఉండి డేట్లు అందుబాటులోకి వస్తే తనే మెయిన్ లీడ్ అవ్వొచ్చు. కానీ ఇప్పటికిప్పుడు ఖరారుగా చెప్పలేం. కియారా అద్వానీని ట్రై చేస్తున్నా డేట్ల సమస్య వల్ల ఇష్టం ఉన్నా చేయలేని పరిస్థితిలో తనుంది. లాస్ట్ ఛాయస్ గా దిశా పటాని లాంటి వాళ్ళను పరిగణనలోకి తీసుకుంటారు.

Jr NTR: Koratala will cast Charan's heroine for Tarak's movie Will NTR cast Kiara Advani as the heroine in Koratala Siva – iittm.in

అరవింద సమేత వీర రాఘవ తర్వాత విపరీతమైన గ్యాప్ వచ్చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడీ సినిమాను వేసవిలోగా పూర్తి చేసి దసరా రిలీజ్ కు రెడీ చేసేలా కొరటాల శివకు ముందే చెప్పారట. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న ప్లానింగ్ మారకూడదని ప్రతిదీ ప్లాన్ ప్రకారమే చేసుకుంటే ఈజీగా దసరాకు వచ్చేయొచ్చనే ఆలోచనతో స్కెచ్ వేస్తున్నారట. స్టూడెంట్ ప్లస్ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఒక పవర్ ఫుల్ సబ్జెక్టుతో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామాని పెద్ద హిట్ చేయడం కొరటాలకు చాలా అవసరం. ఆచార్య తాలూకు గాయం బాగా బాధించిన నేపథ్యంలో మళ్ళీ కంబ్యాక్ అవ్వడానికి ఇంతకన్నా బెస్ట్ ఛాన్స్ ఉండదు. అదెలా చేస్తాడనేది ఇంకో పది నెలలు ఆగాలి మరి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి