iDreamPost

చంద్రబాబు లాయర్ల విచిత్ర పిటిషన్.. ప్రచారం కోసమేనా?: జర్నలిస్ట్ సాయి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో.. ఒక వ్యక్తి ఎన్ని రకాల పిటిషన్లు వేయ్యోచ్చు అర్ధమైందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు లాయర్లు మరో విచిత్రమైన పిటిషన్ వేశారు.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో.. ఒక వ్యక్తి ఎన్ని రకాల పిటిషన్లు వేయ్యోచ్చు అర్ధమైందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు లాయర్లు మరో విచిత్రమైన పిటిషన్ వేశారు.

చంద్రబాబు లాయర్ల విచిత్ర పిటిషన్.. ప్రచారం కోసమేనా?: జర్నలిస్ట్ సాయి

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయన జైలుకు వెళ్లి 40 రోజులు దాటింది. ఇక చంద్రబాబు అరెస్టు తరువాత ఏసీబీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు అన్నిచోట్ల ఆయన లాయర్లు అనేక పిటిషన్లు వేస్తున్నారు. వీళ్లు వేస్తున్న పిటిషన్లు చూసి సామాన్య జనం సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడంతో.. ఒక వ్యక్తి ఎన్ని రకాల పిటిషన్లు వేయ్యోచ్చో అర్ధమైందని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే చంద్రబాబు లాయర్లు మరో విచిత్రమైన పిటిషన్ వేశారు. ఆ విచిత్ర పిటిషన్ గురించి ప్రముఖ జర్నలిస్ట్ సాయి వివరించారు.

చంద్రబాబు నాయుడు అరెస్టైన తరువాత  ఆయన తరపు లాయర్లు క్వాష్  పిటిషన్, ముందస్తు బెయిల్, మధ్యంతర బెయిల్, అంటూ ఎన్నో పిటిషన్లు వేశారు. ఇటీవలే ఓ విచిత్రమైన పిటిషన్ కూడా ఏసీబీ కోర్టులో బాబు లాయర్లు వేశారు. సీఐడీ అధికారుల కాల్ డేటా రికార్డు కావాలని బాబు లాయర్లు విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ని ఈ నెల 26కు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు లాయార్లు దాఖలు చేసిన పిటిషన్ పై కౌంటర్ల దాఖలు చేయాలని సీఐడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను అడిగింది. ఈ నేపథ్యంలోనే బాబు  లాయర్లు వేసిన ఈ కొత్త పిటిషన్ పై జర్నలిస్ట్ సాయి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. చంద్రబాబు లాయర్లు కేవలం ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేశారని సాయి తెలిపారు.

“మనల్ని ఎవరు పట్టించుకోకపోతే.. గుర్తింపు కోసం  తపన పడటం. దీనినే ఐడెంటిటి క్రైసిస్. ప్రస్తుతం చంద్రబాబు లాయర్లకు ఈ సమస్య ఎదురవుతుంది. చంద్రబాబు లాయర్లు వాదనల ద్వారా చంద్రబాబును బయటకు తీసుకొస్తే సక్సెస్ అవుతారు. అంతే కానీ జడ్జీలపై అరవడం, వారి మీదకు వెళ్లడం లాంటి చేయడం ద్వారా ప్రచారం పొందుతున్నారు. అంతేకాక వీళ్లు చిత్ర విచిత్ర పిటిషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలోనే న్యాయమూర్తులు కూడా కొన్ని పిటిషన్లను కొట్టేశారు. అలాంటి వాటిల్లో ములాఖత్ ల సంఖ్య పెంచమని వేసిన పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టేసింది. గతంలో పొన్నవోలు సుధాకర్ గురించి ఓ పిటిషన్ వేశారు.

తాజాగా సీఐడీ కాల్ డేటా రికార్డు ఇవ్వాలంటూ పిటిషన్ వేశారు. దీనిని ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు.  చంద్రబాబును అరెస్టు చేసే రోజు సీఐడీ అధికారులు..  సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఇంతా చేయించారని బాబు లాయర్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి.. అదే రోజు చంద్రబాబు ఎవరెవరితో మాట్లాడారో ఆ కాల్ డేటా కూడా అడిగితే మంచిది కదా. లోకేశ్ కాల్ డేటా, వీరికి ఢిల్లీ నుంచి సహకరించే వారి కాల్ డేటా అడిగితే సరిపోతుంది. ఎందుకుంటే అరెస్టు చేసే ముందు రోజు రాత్రే చంద్రబాబుకు అధికారులు వస్తారని  తెలుసు. అంటే రాత్రి నుంచి తెల్లవారు జామున అరెస్టు చేసే వరకు చంద్రబాబు ఎవరితోనో మాట్లాడి ఉంటారు కదా.

ఆ సమయంలో ఎవరెవరితో మాట్లాడారో అది కూడా బయటకు తీయాలి కదా. ఈ విధంగా చంద్రబాబు కూడా ప్రజల్ని మోసం చేసినట్లే కదా. అంతేకాక చంద్రబాబు తరపు న్యాయవాదులు జడ్జీ తీర్పు ఇచ్చే సమయంలో ఆమె ఫోన్ మోగిందంటూ కామెంట్ కూడా చేశారు. ఆ విధంగా  మా ఇష్టం ఎవరి మీదైనా బురద జల్లుతాము, వాళ్లే తుడుచుకోవాలి, వాళ్లు వచ్చి సాక్ష్యాలు ఇవ్వాలి అన్నట్లు వ్యవహరిస్తే కేసులు నిలుస్తాయా?. కానీ బాబు లాయర్లు ఇలా ఎందుకు చేస్తున్నారంటే.. వాళ్లకి ప్రచారం కావాలి. ఆ ప్రచారం కోసమే ఇప్పుడు కోర్టులో వాదనలు నడుస్తున్నాయి” అని జర్నలిస్ట్ సాయి తెలిపారు. మరి.. సాయి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి