iDreamPost

Jersey : ఇద్దరి మధ్య షాహిద్ నిలవగలడా

Jersey : ఇద్దరి మధ్య షాహిద్ నిలవగలడా

చ్చే నెల మూడో వారంలో బాక్సాఫీస్ క్లాష్ ఆసక్తికరంగా ఉండబోతోంది. తెలుగులో నాని నటించి ఎమోషనల్ డ్రామాగా చాలా పేరు తీసుకొచ్చిన జెర్సి అదే టైటిల్ తో అదే దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో హిందీలో రీమేక్ అయిన సంగతి తెలిసిందే. ఇది ఏప్రిల్ 14న విడుదల కాబోతోంది. అయితే అదే రోజు కెజిఎఫ్ 2 ఉన్నా లెక్క చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఎందుకంటే ఆ సినిమాకున్న హైప్ అంతా ఇంతా కాదు. క్రేజీ బిజినెస్ ఆఫర్స్ తో హాట్ కేకులా అమ్ముడుపోతోంది. పుష్ప పార్ట్ 1, ఆర్ఆర్ఆర్ కు వచ్చిన రెస్పాన్స్ చూశాక నిర్మాతలు హోంబాలే ఫిలింస్ కి గట్టి నమ్మకం వచ్చేసింది ఇది కూడా రికార్డులు బద్దలు కొడుతుందని.

ఒక రోజు ముందు విజయ్ బీస్ట్ ఏప్రిల్ 13 రావడం ఇక్కడ ప్రధానంగా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం. దీన్ని హిందీలో రా టైటిల్ తో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. ప్యాన్ ఇండియా మూవీ కావడంతో థియేటర్లు కూడా భారీగా ప్లాన్ చేశారు. డాక్టర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ హోస్టేజ్ డ్రామా చాలా డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. మరి ఇంత హైప్ ఉన్న ఈ రెండింటి మధ్య జెర్సి నిలవడం కాన్ఫిడెన్సో లేక మరొకటో అంతు చిక్కడం లేదు. తెలుగు జెర్సికి కూడా ఎంత గొప్ప పేరు వచ్చినా అదే స్థాయిలో వసూళ్లు రాలేదు. నిర్మాత గట్టెక్కాడు కానీ థియేటర్లలో ఆశించిన అద్భుతాలు జరగలేదు.

అలాంటప్పుడు ఫ్రేమ్ టు ఫ్రేమ్ రీ మేక్ చేసిన హిందీ వెర్షన్ విరగాడేస్తుందని అనుకోలేం. అందులోనూ ఇంత పోటీ మధ్య. దీని ప్రొడక్షన్ లో దిల్ రాజు, అల్లు అరవింద్ నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారు. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత షాహిద్ కపూర్ ఆశలన్నీ దీని మీదే ఉన్నాయి. ఇంత హెవీ ఎమోషన్ ని అక్కడి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఇక్కడి తెలుగు రాష్ట్రాల్లో దీని మీద పెద్ద ఆసక్తి లేదు. నానిని మించి షాహిద్ ఎలా చేసుంటాడన్న అంచనాలు ఎవరూ పెట్టుకోలేదు. సో నార్త్ స్టేట్స్ ని టార్గెట్ పెట్టుకుని వెళ్లాల్సిందే తప్ప జెర్సీ తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో ఇంకో మూడు వారాల్లో తేలిపోతుంది

Also Read : The Kashmir Files : ఆర్ఆర్ఆర్ దెబ్బకు తగ్గిపోయిన కలెక్షన్లు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి