iDreamPost

లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్.. ఎన్ని వందల కోట్లంటే?

లగ్జరీ ఎస్టేట్ కొనుగోలు చేసిన జెఫ్ బెజోస్.. ఎన్ని వందల కోట్లంటే?

అమెజాన్ వ్యవస్థాపకుడు, ప్రపంచ అత్యంత సంపన్నుల్లో ఒకరైనా జెఫ్ బెజోస్ మరోసారి వార్తల్లో నిలిచారు. జెఫ్ బెజోస్ ఈసారి ఒక ఖరీదైన ఎస్టేట్ ని కొనుగోలు చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అది కూడా కోటీ పది కోట్లు కాదు.. ఏకంగా కొన్ని వందల కోట్లు పెట్టి కేవలం 2.1 ఎకరాల లగ్జరీ ఎస్టేట్ ని కొనుగోలు చేయనున్నట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ ఎస్టేట్ దాదాపు 9,300 చందరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందని చెబుతున్నారు.

జెఫ్ బెజోస ఇంతటి ఖరీదైన ఎస్టేట్ కొనుగోలు చేయబోతున్నారు అనే వార్త ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతోంది. ఫ్లోరిడాలోని వాటర్ ఫ్రంట్ మాన్షన్ జెఫ్ బెజోస్ ఆస్తుల చిట్టాలో ఇప్పుడు ఈ ఖరీదైన ఎస్టేట్ కూడా చేరోబోతోంది అని చెబుతున్నారు. 2.1 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మూడు పడకల ఎస్టేట్ ని 1965లో నిర్మించారు. ఇది ఎంటీఎం స్టార్ ఇంటర్నేషనల్ అనే పేరుతో రికార్డుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అదే ప్రాంతంలో మరిన్ని ఆస్తులు కొనుగోలు చేసేందుకు జెఫ్ బెజోస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ కూడా నడుస్తోంది. అయితే ఇప్పుడు తీసుకుంటున్న ఈ ప్రాపర్టీని బిలియనీర్ బంకర్ అంటారని సోర్స్ ద్వారా తెలిసినట్లు బ్లూమ్ బర్గ్ వెల్లడించింది.

ఈ ప్రాంతంలో అంత ధర ఎందుకు ఉంది అనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేవాళ్లు అంతా బిలియనేర్లు అంటున్నారు. జెఫ్ బెజోస్ తో పాటుగా కార్ల్ ఇకాన్, ఇవాంకా ట్రంప్, టామ్ బ్రాడీ, జారెడ్ కుష్నర్ వంటి వాళ్లకి ఇక్కడ ఇళ్లు ఉన్నాయి. భార్యతో విడాకుల తర్వాత బెజోస్ కు ఖరీదైన ప్రాపర్టీల మీద మోజు పెరిగిందని కామెంట్ చేస్తున్నారు. ఇటీవల జెఫ్ బెజోస్ ప్రేయసి లారెన్ శాంచెజ్ తో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఆమెతో ఏకాంతంగా గడిపేందుకు ఈ లగ్జరీ ప్రాపర్టీని కొనుగోలు చేశారు అని కూడా చెబుతున్నారు. ఇప్పటికే ఆయనకు ఉన్న ప్రాపర్టీల వివరాలు వింటే మతి పోవాల్సిందే. వాషింగ్టన్ డీసీలో 9 ఎకరాల విస్తీర్ణంలో 165 మిలియన్ డాలర్ల విలువచేసే బెవర్లీ హిల్స్ మాన్షన్, మౌయ్ లో ఒక ఎస్టేట్, లగ్జరీ అపార్ట్ మెంట్స్, మాన్ హాటన్, సీటెల్ లో ఆస్తులు, టెక్సాల్ ఏకంగా 3 లక్షల ఎకరాల భూమి ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి