iDreamPost

ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం…

ప్రశాంత్ కిషోర్ అల్టిమేటం…

బీజేపీతో దశాబ్దాల కాలం పాటు ఆప్త మిత్రులుగా కొనసాగిన శివసేన ఇప్పటికే బిజెపితో విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్డీయే కూటమిలో అతిపెద్ద పార్టీగా ఉన్న బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ నేతృత్వంలని జేడీయూ కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉన్నట్లు కనబడుతుంది. తాజాగా ఎన్‌ఆర్‌సీ ఆందోళనలు దానికి మరింత ఆజ్యంపోశాయి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ యన్నార్సీ ని ఎట్టి పరిస్థుల్లోనూ తమ రాష్ట్రం లో అనుమతించబోమని బహిరంగంగానే తేల్చి చెప్పారు. మరోవైపు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ సమయంలో సీట్ల పంపకాలపై బీజేపీ-జేడీయూలో ఇప్పటికే చర్చలు మొదలైయ్యాయి. ఈ నేపథ్యంలో జేడీయూ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో ఇప్పడు అసక్తికరంగా మారాయి.

ఆదివారం ఓ‍ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో ప్రశాంత్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో జేడీయూకే సింహాభాగం సీట్లు కేటాయించాలని అన్నారు. సీట్ల ఒప్పందంపై బీజేపీ నేతలు మరోసారి పునపరిశీలన చేసుకోవాలని సూచించారు. బీజేపీ నాయకత్వం అనుకుంటున్నట్టు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 50:50 నిష్పత్తిలో సీట్ల పంచుకోవడం కుదరదని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో 1:4 ఫార్మూలాను ఆయన తెరపైకి తీసుకువచ్చారు. అయితే ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడ్డారు. సీట్ల పంపకాలపై ఇరు పార్టీల అధినేతలు నిర్ణయం తీసుకుంటారని, దీనిలో పీకే తలదూర్చడం సరికాదని తప్పపట్టారు

దీంతో ప్రశాంత్‌ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. కాగా బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పడిప్పుడే గళం విప్పుతున్న నితీష్‌కు అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాలుగా మారాయి. గత అసెం‍బ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌-ఆర్జేడీ-జేడీయూ “మహా ఘట్‌ బంధన్‌” గా ఏర్పడి విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన పరిణామాల్లో జెడియు మిత్రపక్షం ఆర్జెడీ కాంగ్రెస్ కూటమికి గుడ్‌బై చెప్పి మళ్లీ బీజేపీతో కలిసి బిజెపి మద్దతు తో సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించారు కాగా మహారాష్ట్రలో బిజెపికి వ్యతిరేకంగా ఇటీవల శివసేన తిరుగుబాటు చేసి ప్రతిపక్షపార్టీల సహాయంతో అధికారాన్ని స్వాధీనం చేసుకోవడంతో ఇప్పుడు త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో జెడియు మెజారిటీ సీట్లు పట్టు బడుతున్నప్పటికీ బిజెపి మాత్రం లోక్‌సభ ఎన్నికల్లో లాగా 50:50 చొప్పున సీట్లు పంచుకోవాల్సిందేనని పట్టుబడుతోంది

దీనిపై బిజెపి నాయకుడు నితిన్ నవీన్ స్పందిస్తూ రెండు పార్టీల హైకమాండ్ సీట్ల సర్దుబాటు అంశం చూసుకుంటుందని కాగా ఈ విషయంలోప్రశాంత్ కిషోర్ ఎందుకు ఎక్కువ ఆసక్తి చుపిస్తున్నాడో మాకు అర్థం కావాడం లేదు” అని వ్యాఖ్యానించారు. ఈ నెల ప్రారంభంలో పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా మాట్లాడే నితీష్ కుమార్ లోక్సభలో బిల్లు సమర్పణ సందర్భంగా తన వైఖరిని మార్చుకున్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జెడి (యు), బిజెపి రెండూ చెరి 16 సీట్లలో విజయం సాధించాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి