iDreamPost

బిగ్ బ్రేకింగ్: కోర్టులో లొంగిపోయిన ప్రముఖ నటి జయప్రద

Jayaprada Surrender in Court: బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద రెండు కేసుల్లో పరారీ కొద్దిరోజులుగా పరారీలో ఉన్నారు.. తాజాగా ఆమె కోర్టులో లొంగిపోయారు.

Jayaprada Surrender in Court: బీజేపీ మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద రెండు కేసుల్లో పరారీ కొద్దిరోజులుగా పరారీలో ఉన్నారు.. తాజాగా ఆమె కోర్టులో లొంగిపోయారు.

బిగ్ బ్రేకింగ్: కోర్టులో లొంగిపోయిన ప్రముఖ నటి జయప్రద

భారతీయ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా వెలిగిపోయిన నటి జయప్రద తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో కొనసాగుతున్నారు.   గత ఎన్నికల సమయంలో ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారంటూ ఆమెపై రెండు కేసులు నమోదు అయ్యాయి. జయప్రదపై పలుమార్లు నోటీసులు, నాన్‌బెయిలబుల్ వారెంట్లు ఉన్నప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె పరారీలో ఉన్నట్లు ప్రకటించింది. అంతేకాదు  ఆమె ఎక్కడ ఉన్న వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె కీలక నిర్ణయం తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే..

2019 లో లోక్ సభ ఎలక్షన్స్ సమయంలో బీజేపీ అభ్యర్థిగా పోలీ చేసిన జయప్రద పై రెండు కేసులు నమోదు అయ్యాయి. ఎన్నికల సమయంలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు గాను రాంపూర్ లో ఆమెపై ఈ కేసులు నమోదు అయ్యాయి. కోర్టు ఎన్నోసార్లు ఆమెకు సమన్లు, వారెంట్ జారీ చేసినా వాటికి స్పందించలేదు. ఎన్నో వాయిదాలకు ఆమె గైర్హాజరయ్యారు. దీంతో కోర్టు ఆమెపై వారెంట్ ఇష్యూ చేసింది. ఆ తర్వాత నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయినప్పటికీ ఆమె హాజరు కాకపోవడంతో ఆగ్రహించిన కోర్టు మాజీ ఎంపీ, నటి జయప్రద పరారీలో ఉన్నట్లు  ప్రకటించింది. అంతేకాదు ఆమె పై సీఆర్పీసీ 82 సెక్షన్ కింద చర్యలు తీసుకోవాలంటూ.. ఒక డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో బృందాన్ని ఏర్పాటు చేసి ఆమె ఎక్కడ ఉన్నా ఆరో తేదీ లోపు వెతికి పట్టుకొని కోర్టులో హాజరు అయ్యేలా చేయాలని రాంపూర్ సూపరింటెండెంట్ ని ఆదేశింది. ఈ క్రమంలోనే జయప్రద సోమవారం మార్చి 4 వ తేదీనీ రాంపూర్ కోర్టులో లొంగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి