iDreamPost

కొద్దిలో బతికిపోయిన బుమ్రా! లేదంటే.. మళ్లీ ఆస్పత్రి పాలయ్యేవాడు!

  • Author Soma Sekhar Updated - 10:24 AM, Sat - 19 August 23
  • Author Soma Sekhar Updated - 10:24 AM, Sat - 19 August 23
కొద్దిలో బతికిపోయిన బుమ్రా! లేదంటే.. మళ్లీ ఆస్పత్రి పాలయ్యేవాడు!

జస్ప్రీత్ బుమ్రా.. టీమిండియా బౌలింగ్ దళానికి వెన్నముక. కానీ వెన్ను గాయంతో దాదాపుగా సంవత్సరం పాటు జట్టుకు దూరం అయ్యాడు. ఇక గాయం కారణంగా టీ20 వరల్డ్ కప్ తో పాటుగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ లాంటి మెగాటోర్నీలకు దూరం అయ్యాడు. దీంతో టీమిండియా బౌలింగ్ వీక్ అయ్యింది. సుదీర్ఘ శిక్షణ తర్వత గాయం నుంచి కోలుకున్నాడు బుమ్రా. ప్రస్తుతం గాయం నుంచి కోలుకున్న బుమ్రాకు ఐర్లాండ్ తో టీ20 సిరీస్ కు జట్టు పగ్గాలను అందించింది మేనేజ్ మెంట్. ఇక రీఎంట్రీ తర్వాత తొలి ఓవర్ లోనే అదరగొట్టాడు బూమ్ బూమ్ బుమ్రా. తొలి ఓవర్ లోనే రెండు వికెట్లను పడగొట్టి తన సత్తా ఏంటో మరోసారి చూపించాడు. ఇదంతా కాసేపు పక్కన పెడితే.. ఈ మ్యాచ్ లో గాయపడే సందర్భం నుంచి బుమ్రా కొద్దిలో మిస్ అయ్యాడు. లేదంటే మళ్లీ ఆస్పత్రి పాలయ్యేవాడే..

డబ్లిన్ వేదికగా ఐర్లాండ్ తో శుక్రవారం జరిగిన తొలి టీ20లో టీమిండియా డక్ వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగుల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. జట్టులో బారీ మెకార్తీ 33 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేసి భారత బౌలర్లను బెంబేలెత్తించాడు. అనంతరం 140 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 6.5 ఓవర్లలో 47/2తో ఉండగా.. మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. దీంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం 2 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించినట్లుగా అంపైర్లు ప్రకటించారు.

ఇక ఈ మ్యాచ్ లో గాయపడే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు బుమ్రా. ఈ ఘటన వాషింగ్టన్ సుందర్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్ లో చోటుచేసుకుంది. సుందర్ వేసిన బంతిని ఐర్లాండ్ ఆటగాడు షాట్ ఆడాడు. ఆ బంతి నేరుగా బౌలండరీ వైపు వెళ్తుండగా.. బుమ్రా బంతి వెనకాలే ఆపడానికి వేగంగా పరిగెత్తుతున్నాడు. ఈ లోపల వేరే పక్కనుంచి రవి బిష్ణోయ్ డైవ్ చేస్తూ.. బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలోనే వేగాన్ని అదుపుచేసుకోలేకపోయిన బుమ్రా.. బిష్ణోయ్ పై నుంచి దూకి బౌండరీ లైన్ లోకి దూకాడు.

దీంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. లేదంటే ఇద్దరు ఢీకొని కిందపడితే.. వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టే అవకాశం లేకపోలేదు. వరల్డ్ కప్ ముంగిట బుమ్రాకు పెద్ద ప్రమాదమే తప్పిందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఏడాది పాటు టీమిండియాకు బుమ్రా దూరం కావడంతో.. భారత బౌలింగ్ దళాన్ని నడిపించే సరైన నాయకుడు లేడు. ఈ విషయం గడచిన సిరీస్ ల్లో, టోర్నీల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇదికూడా చదవండి: వరల్డ్‌ కప్‌ కోసం కోహ్లీకి డైమండ్‌ బ్యాట్‌! ఖరీదెంతో తెలిస్తే షాక్‌ అవుతారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి