iDreamPost

అఫిషియల్‌: నాలుగో టెస్టుకు బుమ్రాతో పాటు మరో ప్లేయర్‌ దూరం!

  • Published Feb 21, 2024 | 11:08 AMUpdated Feb 21, 2024 | 11:08 AM

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్‌ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. మరి అతని ప్లేస్‌లో ఎవర్నీ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టులకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. స్టార్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్‌ ఇచ్చింది టీమిండియా మేనేజ్‌మెంట్‌. మరి అతని ప్లేస్‌లో ఎవర్నీ తీసుకున్నారో ఇప్పుడు చూద్దాం..

  • Published Feb 21, 2024 | 11:08 AMUpdated Feb 21, 2024 | 11:08 AM
అఫిషియల్‌: నాలుగో టెస్టుకు బుమ్రాతో పాటు మరో ప్లేయర్‌ దూరం!

ఇంగ్లండ్‌పై వరుసగా రెండు టెస్టులు గెలిచి టీమిండియా ఫుల్‌ జోష్‌లో ఉంది. తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించినా.. ఓటమి బాధ నుంచి తిరిగి పుంజుకున్న టీమిండియా.. మరింత గట్టిగా ఎదురుదెబ్బ కొట్టింది. విశాఖలో జరిగిన రెండో టెస్టుతో పాటు ఇటీవల రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన టెస్టులోనూ టీమిండియా అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను టీమిండియా చిత్తు చేసింది. మొత్తం ఐదు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ నెల 23 నుంచి రాంచీ వేదికగా నాలుగో టెస్టుల మొదలు కానుంది. ఈ టెస్టులో రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా బరిలోకి దిగనుంది. మరోవైపు ఇంగ్లండ్‌ ఎలాగైన నాలుగో టెస్ట్‌ గెలిచి.. సిరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో ఉంది.

అయితే.. నాలుగో టెస్టులకు టీమిండియా కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. తొలి మూడు మ్యాచ్‌ల్లో అద్భుతంగా రాణించిన జస్ప్రీత్‌ బుమ్రాకు నాలుగో టెస్టులో రెస్ట్‌ ఇవ్వనున్నారు. బుమ్రా స్థానంలో ముఖేష్‌ కుమార్‌ను జట్టులోకి తీసుకున్నారు. అలాగే గాయంతో జట్టుకు దూరమైన కేఎల్‌ రాహుల్‌ నాలుగో టెస్టుతో జట్టులోకి తిరిగి వస్తాడని అంతా భావించారు. కానీ, గాయం నుంచి రాహుల్‌ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోని కారణంగా అతన్ని కూడా నాలుగో టెస్టులకు దూరంగా ఉంచారు. దీంతో.. నాలుగో టెస్టులో టీమిండియా ఒక్క మార్పుతో బరిలోకి దిగనుంది. బుమ్రా స్థానంలో ముఖేష్‌ కుమార్‌ టీమ్‌లోకి రానున్నాడు. అయితే.. ముఖేష్‌ను ప్లేయింగ్‌ ఎలెవన్‌లోకి తీసుకుంటారా? లేదా అన్నది తెలియదు.

Bumrah and another player away from the fourth test!

రాంచీ పిచ్‌ పరిస్థితులను బట్టి టీమిండియా ఎలాంటి ప్లేయింగ్‌ ఎలెవన్‌తో బరిలోకి దిగనుందో వేచి చూడాలి. అయితే.. మూడో టెస్టుకు ముఖేష్‌ కుమార్‌ను పక్కనపెట్టిన విషయం తెలిసిందే. బుమ్రా, సిరాజ్‌ను టీమ్‌లోకి తీసుకోవడంతో ముఖేష్‌ను పక్కనపెట్టారు. ఈ క్రమంలోనే వెళ్లి రంజీ మ్యాచ్‌ ఆడాల్సిందిగా ముఖేష్‌కు బీసీసీఐ సూచించింది. మూడో టెస్ట్‌లో పక్కనపెట్టడంతో రంజీ మ్యాచ్‌ ఆడిన ముఖేష్‌ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. ఏకంగా 10 వికెట్లతో చెలరేగాడు. ఓ ఇన్నింగ్స్‌లో 6, మరో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. నాలుగో టెస్ట్‌కు బుమ్రాకు రెస్ట్‌ ఇవ్వడంతో ముఖేష్‌కు మళ్లీ పిలుపొచ్చింది. మరి బుమ్రాకు రెస్ట్‌ ఇచ్చి ముఖేష్‌ను తీసుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి