iDreamPost

టాలీవుడ్ లో జాన్వీ జోరు.. కోట్లలో పారితోషకమైనా కండిషన్స్ అప్లై!

Janhvi Kapoor Tollywood Lineup: జాన్సీ కపూర్ టాలీవుడ్ లో జోరు పెంచేస్తోంది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అమ్మడు గురించి టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది.

Janhvi Kapoor Tollywood Lineup: జాన్సీ కపూర్ టాలీవుడ్ లో జోరు పెంచేస్తోంది. వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతోంది. ఇప్పుడు ఈ అమ్మడు గురించి టాలీవుడ్ లో పెద్ద చర్చే జరుగుతోంది.

టాలీవుడ్ లో జాన్వీ జోరు.. కోట్లలో పారితోషకమైనా కండిషన్స్ అప్లై!

జాన్వీ కపూర్.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఈ అమ్మడి పేరు మారు మోగుతోంది. ఇన్నాళ్లు బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ఈ భామ.. ఇప్పుడు టాలీవుడ్ లో తెరంగేట్రానికి సిద్ధమైపోయిన విషయం తెలిసిందే. ఎప్పుడెప్పుడు తెలుగులో సినిమాలు చేస్తుందా అని ఎదురుచూసిన వారికి గుడ్ న్యూస్ అయితే చెప్పింది. ఇప్పుడు అది డబుల్ ధమాకాగా మారిపోయింది. అయితే ఈ అమ్మడు ఇప్పుడు టాలీవుడ్ లో మూవీలకు కొత్త కండిషన్స్ పెడుతోంది అంటూ టాక్ వినిపిస్తోంది. మరి.. కండిషన్స్ ఏంటి? ఎందుకు అలాంటి నిర్ణయాలు తీసుకుందో చూద్దాం.

అలనాటి తార శ్రీదేవి కుమార్తెగానే కాకుండా జాన్వీ కపూర్ కు బాలీవుడ్ లో మంచి గుర్తింపే ఉంది. కానీ, తెలుగు ప్రేక్షకులు మాత్రం శ్రీదేవి వారసురాలిగా జాన్వీ కపూర్ ఎప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెడుతుంది అని కొన్నేళ్లపాటు ప్రశ్నించారు. ఇప్పుడు వారి కోరిక తీరిస్తూ జాన్వీ కపూర్ తారక్ సరసన దేవరలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ గ్యాప్ లోనే జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే కాదు.. రామ్ చరణ్ తో కూడా జాన్వీ కపూర్ జత కట్టబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే వాటిని ఇన్నాళ్లూ ఎవరూ నిర్ధారించలేదు.. అలాగని ఖండించలేదు కూడా.

తారక్ రికమెండేషన్ తోనే రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీలో ఛాన్స్ కొట్టేసిందని టాక్ వచ్చింది. అయితే తాజాగా ఈ వార్తలను బోనీ కపూర్ నిర్ధారించారు. జాన్వీ రామ్ చరణ్ మూవీలో కూడా చేస్తోంది అనే విషయాన్ని అధికారికంగానే ప్రకటించాడు. ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్లుగా మారిన ఇద్దరు స్టార్ హీరోలతో ఈ భామ ఇప్పుడు సినిమాలు చేస్తోంది. ఇన్నాళ్లు టాలీవుడ్ లోకి రాలేదు రాలేదు అనుకుంటుంటే.. మొదటి దెబ్బే ఢబుల్ ధమాకాగా కొట్టింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంక ఈ భామ రెమ్యూనరేషన్ విషయంలో కూడా గట్టిగానే ప్రచారాలు జరుగుతున్నాయి.

టాలీవుడ్ లో సినిమాలకు జాన్వీ కపూర్ రూ.3 కోట్లు తీసుకుంటోంది అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. నిజానికి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్లకు ఆ పారితోషకాన్ని ఇస్తున్నారు. కానీ, అరంగేట్రంతోనే ఇండస్ట్రీలో టాప్ రెమ్యూనరేషన్ తీసుకుంటోది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జాన్వీ కపూర్ టాలీవుడ్ లో సినిమాలకు ఒక కండిషన్ పెట్టింది అంటున్నారు. అదేంటంటే తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు.. కానీ, స్టార్ హీరోలతో మాత్రమే నటిస్తాను అని చెబుతోందంట. అంటే టాప్ ప్లేస్ లో ఉన్న హీరోలతో మాత్రమే సినిమాలు చేయడానికి రెడీ అవుతోంది అంటున్నారు. అయితే ఈ వార్తల్లో ఎంత నిజముందో తెలియదు గానీ.. పారితోషకం, ఈ కండిషన్ మీద మాత్రం టాలీవుడ్ లో గట్టిగానే చర్చ జరుగుతోంది. మరి.. జాన్వీ కపూర్ డబుల్ ధమాకా.. కండిషన్స్ మీద మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలోతెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి