iDreamPost

అసమ్మతిని డైవర్ట్ చేసేందుకు పవన్ కొత్త ప్లాన్!

Pawan Kalyan: ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇరుపార్టీల్లో అసమ్మతి సెగలను రాజేసినా.. జనసేనాలో కాస్త ఎక్కువగా కనిపించాయి. దీంతో అసమ్మతిని డైవర్ట్ చేసేందుకు పవన్ కొత్త ప్లాన్ వేశారని టాక్.

Pawan Kalyan: ఇటీవల టీడీపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితాను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది ఇరుపార్టీల్లో అసమ్మతి సెగలను రాజేసినా.. జనసేనాలో కాస్త ఎక్కువగా కనిపించాయి. దీంతో అసమ్మతిని డైవర్ట్ చేసేందుకు పవన్ కొత్త ప్లాన్ వేశారని టాక్.

అసమ్మతిని డైవర్ట్ చేసేందుకు పవన్ కొత్త ప్లాన్!

రాజకీయాల్లో చాలా చిత్రవిచిత్రమైన ఘటనలు జరుగుతుంటాయి. ముఖ్యంగా సినిమాలకు మించిన నటన, డ్రామాలు, ట్విస్టులు పాలిటిక్స్ లో కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాలు చూసినట్లు అయితే.. అందులోనూ టీడీపీ, జనసేన కూటమి చేస్తున్న రాజకీయం..విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తమ పార్టీల్లోని అసంతృప్తుల సెగలను చల్లార్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అయితే సానుభూతి కొత్త ప్రణాళికలు రచిస్తున్నారని టాక్. అందులో భాగంగానే ఆస్తులను అమ్ముతున్నాను అనే కొత్త నాటకానికి తెరతీశారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయా పడుతున్నారు.

ఇటీవలే టీడీపీ, జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబిత ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అధికార వైఎస్సార్ సీపీ  ఏడు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన రానీ నిరసనలు.. టీడీపీ, జనసేన తొలి జాబితాకే తీవ్రంగా వచ్చేసింది. సీట్ల పంపిణీ అంశం బయటపడగానే ఇరు పార్టీల్లో అసమ్మతి గుప్పుమన్నది. టీడీపీలో కాస్త తక్కువ మోతాదులో అసమ్మతి వ్యక్తమైయినా, జనసేనలో మాత్రం తీవ్రత ఎక్కువే ఉంది. ముఖ్యంగా తమ అధినేత తీసుుకున్న సీట్ల సంఖ్యపై జనసైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుందో. దీంతో కేడర్ లో వెల్లువెత్తిన ఈ అసంతృప్తిని, ఆగ్రహాన్ని చల్లార్చేందుకు పవన్ సరికొత్త డ్రామాకు తెరతీసినట్లు తెలుస్తోంది.అందుకే తాను కష్టాల్లో ఉన్నానని, పేదరికంతో బాధపడుతూనే ప్రజల కోసం పార్టీని నడుపుతున్నానని చెప్పుకునేందుకు సరికొత్త  డ్రామాకు పవన్ తెరతీసినట్లు పలువురు చెబుతున్నారు.

కేవలం చంద్రబాబు వద్ద ప్యాకేజీ తీసుకుని తక్కువ సీట్లకు జనసేనను తాకట్టు పెట్టేశారన్న ఆరోపణలను తప్పించుకునేందుకు పవన్ కొత్త ఎత్తులు వేస్తున్నట్లు పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే తాన ఆస్తులను అమ్ముతున్నట్లు ఒక ప్రకటన చేశారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాను అని తరచూ చెప్పే పవన్  ఇప్పుడు ఆస్తులు ఎందుకు అమ్ముతున్నారనే ప్రశ్నలు వినిపిస్తోన్నాయి. నాగాబాబు అయితే క్యూఆర్ కోడ్ పెట్టి మరీ విరాళాలు వసూళ్లు చేశారు. అలానే గతంలో అభ్యర్థుల దగ్గర నుంచి పవన్ డబ్బులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాంటి తరుణంలో పవన్ ఆస్తులు అమ్ముతున్నట్లు  చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

2019 ఎన్నికల్లో వందకు పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసినప్పుడు కూడా  ఎక్కడా సెంట్ భూమిని కూడా పవన్ కల్యాణ్ అమ్మలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు  24 సీట్లలో పోటీ చేస్తూ ఆస్తులు అమ్ముతున్నట్లు ఎందుకు  ప్రచారం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. కేవలం అసంతృప్తి, ఆవేశంతో ఉన్న జనసేన కేడర్, కాపు నేతలను చల్లబరిచేందుకే అలాంటి పుకార్లు వదులుతున్నారని పలువురు అభిప్రాయా పడుతున్నారు. సినిమాల్లో వివిధ ట్రిక్స్ చూపిండం ద్వారా అభిమానులను ఆకట్టుకున్న రీతిలోనే ఆయన ఇలాంటి  పేద  ఏడుపులు ఏడుస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని గ్లిజరిన్ కన్నీరు కార్చినా ఈసారి కేడర్ నమ్మేది లేదని, అలానే మరోసారి కూడా పవన్ కి బుద్ధి చెప్పడం ఖాయమని పలువురు  అంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి