iDreamPost

ఇండస్ట్రీలో కొత్త ఊపునిస్తున్న జైలు సెంటిమెంట్!

  • Author ajaykrishna Updated - 11:46 AM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 11:46 AM, Fri - 8 September 23
ఇండస్ట్రీలో కొత్త ఊపునిస్తున్న జైలు సెంటిమెంట్!

ఇండస్ట్రీలో ఒక్కోసారి హిట్టు అవుతున్న సినిమాల ఫ్లో బట్టి.. ఒక్కో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని అనిపిస్తుంది. ఇదేం కొత్త కాదు. కానీ.. గతంలో అలా జరగలేదని కాదు. ఒకేసారి ఒకే జానర్, సెంటిమెంట్ తో సినిమాలు విడుదలైన దాఖలాలు లేకపోలేవు. కాకపోతే.. సెంటిమెంట్స్ అనేవి తరచూ మాట్లాడుకునేవి కావు. అయితే.. సినిమా జానర్స్, స్టోరీ లైన్స్ మాత్రమే కాదు. సినిమాలలో ఫ్లాష్ బ్యాక్స్ కూడా అప్పుడప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తుంటాయి. ఆ ఫ్లాష్ బ్యాక్స్ ఎలా ఉన్నప్పటికీ.. సినిమాల ఫలితాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా ఉన్నాయంటే చాలు. ఆ టైమ్ లో అదే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని మాట్లాడుకుంటారు.

ప్రస్తుతం ఇండస్ట్రీలో జైలు సెంటిమెంట్ గట్టిగా వినిపిస్తుంది. ఆ సెంటిమెంటే ప్రెజెంట్ బాక్సాఫీస్ ని ఊపేస్తున్నాయి. గత నెల ఆగష్టులో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన జైలర్ మూవీ.. ఏ రేంజ్ లో రికార్డులు కొల్లగొట్టిందో తెలిసిందే. జైలర్ అనే టైటిల్ కి తగినట్లుగా సినిమాలో రజినీకి జైలు బ్యాక్ డ్రాప్ పెట్టి.. అర్థమైందా రాజా అంటూ బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్నాడు దర్శకుడు నెల్సన్. సూపర్ స్టార్ ని అలా జైలర్ గా చూసేసరికి.. ఫ్యాన్స్ లో ఊపు మామూలుగా రాలేదు. మొత్తానికి టైటిల్ కి న్యాయం చేశారు మేకర్స్. ఇప్పుడు కొత్తగా విడుదలైన షారుఖ్ ఖాన్.. జవాన్ సినిమాలోను జైలు ఎపిసోడ్ కీలక పాత్ర పోషించినట్లు టాక్ వినిపిస్తుంది.

దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ మూవీలో షారుఖ్ జైలులో పుడతాడు. అక్కడినుండి జైలు సెంటిమెంట్ సినిమాలో మెయిన్ రోల్ ప్లే చేస్తూ.. కథను ముందుకు నడిపినట్లు ప్రేక్షకులు చెబుతున్నారు. ఆల్రెడీ ఫస్ట్ డే ప్రీమియర్స్ నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్న జవాన్.. షారుఖ్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు జైలు సెంటిమెంట్ తో బ్లాక్ బస్టర్ అయ్యేసరికి.. అదే సెంటిమెంట్ ఇండస్ట్రీలో ట్రెండ్ అవుతుందని మాట్లాడుకుంటున్నారు. ఆగష్టులో జైలర్.. సెప్టెంబర్ లో జవాన్.. నెక్స్ట్ అక్టోబర్ లో బాలయ్య, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ‘భగవంత్ కేసరి’ రిలీజ్ అవుతోంది. ఈ సినిమాలో కూడా బాలయ్యకు జైలు బ్యాక్ డ్రాప్ కీలకపాత్ర పోషించబోతుందని సమాచారం. ట్రెండ్ అవుతున్న జైలు సెంటిమెంట్ తెలుగులో వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరి జైలు సెంటిమెంట్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి