iDreamPost

ఎంచి చూడగా మనుజులందున మంచి చెడులను రెండే కులములు.. జగన్ నోట గురజాడ మాట..

ఎంచి చూడగా మనుజులందున మంచి చెడులను రెండే కులములు.. జగన్ నోట గురజాడ మాట..

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఆధ్యతం ఉత్కంఠను కలిగిస్తున్నాయి. 6 వరోజు అసెంబ్లీ సమావేశంలో ఆసక్తి కర పరిణామలు చోటు చేసుకున్నాయి. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబానాయుడుని టార్గెట్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గత పాలనను తూర్పారబట్టారు.

ఎస్సీ,ఎస్టీల పై చంద్రబాబుది స్వార్ధపూరిత ప్రేమ అని, వాళ్లనెపుడూ ఆయన చులకనగానే చూసారని జగన్ అన్నారు. చంద్రబాబు లాంటి వారి బుద్ది ఉన్న వాళ్లను చూసే గురజాడ 100 సంవత్సరాల క్రితమే ఎంచి చూడగా మనుషులందున మంచి చెడులను రెండే కులములు.. మంచి అన్నది మాల అయితే ఆ మాలనేనవుతా అని మహాకవి గురజాడ అన్నారని, కానీ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నపుడు దళిత కులంలో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అని వాఖ్యానించారని అది ఆయన నైజమన్నారు. 

చంద్రబాబు హయాంలో దళితులు ఎన్నో ఇబ్బందులు పడ్డారని కానీ వైసిపి ప్రభుత్వం క్యాబినెట్ లో 60శాతం ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలకు అవకాశం ఇచ్చామన్నారు. నామినేటెడ్ పోస్ట్ లలో కూడా 50 శాతం వారికే అవకాశం కల్పించామని జగన్ తెలిపారు. ఓట్లకోసం కులాలను చీల్చడం, బిడ్డ నిచ్చిన మామనే వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నిజస్వరూపమని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీల కోసం చారిత్రాత్మక బిల్లును ప్రవేశపెడుతున్నట్టు జగన్ తెలిపారు.

ఎస్సీ,ఎస్టీ లకు రెండు సపరేట్ కమీషన్ లను ఏర్పాటు చేస్తూ బిల్లు తీసుకు వస్తున్నామన్నారు. దీనివలన ఎస్సీ,ఎస్టీ ల సమస్యలను పరిష్కరించటానికి , వాళ్ల అభివృద్ది కోసం మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి మార్గం సులభమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి సమయంలో కూడా సిగ్గులేకుండా టీడిపి సభ్యులు వ్యవహరించడంలో సిగ్గుచేటని, దీనికి వెనుక కూర్చొని నవ్వుకుంటూ చంద్రబాబు ప్రోత్సహించటం దిక్కుమాలిన చర్య అని జగన్ ఎద్దేవా చేశారు. చారిత్రాత్మక బిల్లు గురించి సభలో మాట్లాడుతుంటే బఫూన్ లలా గోల చేస్తున్న సభ్యులను సభనుండి బహిష్కరించినా ఏంకాదని స్పీకర్ కు సీఎం విన్నవించారు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి