iDreamPost

ఏపీలో వారికి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. రూ. 3 లక్షలు పొందే అవకాశం

ఏపీలో వారికి శుభవార్త చెప్పిన జగన్ సర్కార్.. రూ. 3 లక్షలు పొందే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌లోని పాడి రైతులకు జగన్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పాడి రైతులు వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు తోడ్పాటును అందిస్తుంది. ఇందుకోసం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా జగనన్న పాలవెల్లువ లబ్దిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయించడమే కాకుండా.. రుణాల మంజూరు అయ్యేలా చర్యలు చేపట్టింది. ఇందుకోసం జిల్లాల వారీగా పలు బ్యాంకులకు లక్ష్యాలను నిర్దేశించింది జగన్ ప్రభుత్వం. ఇటీవల నిర్వహించిన బ్యాంకర్ల సబ్ కమిటీ సమావేశంలో పాల వెల్లువ లబ్దిదారుల వివరాలను జగన్ సర్కార్ అందించింది. 18 జిల్లాల్లోని 2.28 లక్షల మంది లబ్దిదారుల వివరాలను అందించింది.

ఈ లబ్దిదారులకు పశు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చి, రుణాలు మంజూరు చేయాలని ఆ సమాశంలో ప్రభుత్వం తెలిపింది. రాష్ట్రంలోని అర్హులైన పశు, మత్స్యకార రైతులకు ఈ కార్డులు ఇవ్వాలని, ఇందు కోసం జిల్లాల వారీగా ప్రభుత్వం నియమించిన నోడల్ అధికారులతో శిబిరాలు నిర్వహించాలని బ్యాంకర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. అలాగే ఈ కార్డులు ఇచ్చేందుకు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు వరకు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని బ్యాంకులకు సూచించింది. ఈ కార్డులపై వర్కింగ్ క్యాపిటల్‌గా లబ్దిదారులకు రూ. 2 లక్షల నుండి రూ. 3 లక్షలు బ్యాంకులు రుణాలిస్తాయి.

ఈ రుణాలకు 1.5 శాతం వడ్డీ రాయితీ ఉంటుంది. సకాలంలో రుణాలు చెల్లిస్తే.. వారికి వార్షిక వడ్డీలో 3 శాతం వెంటనే రీ పేమెంట్ ప్రోత్సహానికి అర్హులవుతారు. కార్డులతో పాటు రుణాల మంజూరుకు ప్రతి శుక్రవారం బ్యాంకులు ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తాయి. అర్హుల నుండి దరఖాస్తులను స్వీకరించి, వెంటనే ప్రాసెస్ చేస్తాయి. అలాగే వైఎస్సార్ చేయూత, ఆసరా లబ్దిదారులకు క్రెడిట్ కార్డులు, రుణాల మంజూరులో ప్రాధాన్యత ఇవ్వాలని బ్యాంకర్లకు స్పష్టం చేసింది ప్రభుత్వం. వైఎస్సార్‌ ఆసరా, చేయూత మహిళా లబ్దిదారుల జీవనోపాధి మెరుగుపరిచేందుకు పాడి పశువుల కొనుగోళ్లకు బ్యాంకుల ద్వారా ఇప్పటికే రుణాలు మంజూరు అవుతున్నాయి. వీరి నుంచి అమూల్‌ ద్వారా పాల సేకరణ చేస్తున్న సంగతి తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి