iDreamPost

Pinky Priyanka: ఆస్పత్రి పాలైన జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ పింకీ! ఏమైందంటే..?

  • Published Feb 20, 2024 | 12:40 PMUpdated Feb 20, 2024 | 12:40 PM

జబర్డస్త్‌ ఆర్టిస్ట్‌ పింకీ ప్రియాంకా ఆస్పత్రి పాలైంది. ఆమె ఆస్పత్రిలో ఎందుకు చేరిందో తెలియజేస్తూ.. ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పింకీ ఎమోషనల్‌ అవుతూ.. తన పరిస్థితి ఇంకేవరికి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

జబర్డస్త్‌ ఆర్టిస్ట్‌ పింకీ ప్రియాంకా ఆస్పత్రి పాలైంది. ఆమె ఆస్పత్రిలో ఎందుకు చేరిందో తెలియజేస్తూ.. ఒక వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో పింకీ ఎమోషనల్‌ అవుతూ.. తన పరిస్థితి ఇంకేవరికి రాకుండా జాగ్రత్త పడాలని చెప్పింది. ఆ వివరాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

  • Published Feb 20, 2024 | 12:40 PMUpdated Feb 20, 2024 | 12:40 PM
Pinky Priyanka: ఆస్పత్రి పాలైన జబర్దస్త్‌ ఆర్టిస్ట్‌ పింకీ! ఏమైందంటే..?

పాపులర్‌ కామెడీ షో జబర్దస్త్‌లో ట్రాన్స్‌జెండర్‌ పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పింకీ తాజాగా ఆస్పత్రి పాలైంది. జబర్దస్త్‌ షోతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు జీ తెలుగులో సూపర్‌ జోడీ అనే డాన్స్‌ ప్రోగ్రామ్‌లో అవకాశం వచ్చింది. అందులో కూడా పింకీ ఆకట్టుకుంటోంది. అయితే..ఘీ వారం షోకి ఆమె అటెండ్‌ కాలేదు. దీంతో ఆమె ఈ వారం ఎపిసోడ్‌కి ఎందుకు రాలేదనే విషయంపై ప్రేక్షకుల్లో ఆసక్తి మొదలైంది. అయితే.. తాను ఎందుకు ఈ వారం ఎపిసోడ్‌కి రాలేకపోయానో కారణం వివరిస్తూ.. పింకీ ఒక వీడియోను రిలీజ్‌ చేసింది. అది కూడా ఆస్పత్రి బెడ్‌పై నుంచి. తాను చేసిన తప్పును మరెవరూ చేయవద్దంటూ పింకీ చాలా ఎమోషనల్‌ అయింది. అసలు పింకీ ఏం తప్పు చేసింది. ఆమె ఎందుకు ఆస్పత్రి పాలైందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

సూపర్‌ జోడీ డాన్స్‌ చేస్తున్న క్రమంలో దాదాపు 20 రోజుల నుంచి పింకీ సరైన రెస్ట్‌ లేకుండా డాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తూనే ఉంది. ఈ క్రమంలోనే పెయిన్‌ కిల్లర్‌ ట్యాబ్లెట్స్‌ను విపరీతంగా వాడింది. అదే ఇప్పుడు ఆమె ప్రాణాల మీదకు వచ్చింది. వైరల్‌ ఫీవర్‌తో ఆస్పత్రిలో చేరిన పింకీకి బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌తో పాటు లివర్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలోనే పింకీ వీడియోవ విడుదల చేసి అందులో ఇలా తెలిపింది.. ‘నేను చేసిన తప్పును తప్పును ఇంకెవరూ చేయకండి. రెస్ట్‌ లేకుండా 20 రోజుల పాటు డాన్స్‌ ప్రాక్టీస్‌ చేశా.. దాంతో ఒళ్లు నొప్పుల తగ్గడానికి పెయిన్ కిల్లర్స్‌ వాడా.. అలా ఎక్కువ వాడటంతోనే ఇక్కడి దాకా వచ్చింది. వైరల్‌ ఫీవర్‌ సివియర్‌ కావడంతో ప్లేట్‌లేట్స్‌ కూడా బాగా పడిపోయాయి.

బాడీ బాగా డీహైడ్రేట్‌ అవ్వడంతో బ్లడ్‌ ఇన్ఫెక్షన్‌, యూరిన్‌ ఇన్ఫెక్షన్‌, లివర్‌ ఇన్ఫెక్షన్‌ వచ్చిందని డాక్టర్స్‌ అంటున్నారు. కాబట్టి అంతా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. వాటర్‌ ఎక్కువగా తాగండి. డాక్టర్‌ సలహా లేకుండా ఎలాంటి మెడిసిన్‌ వాడొద్దు. ఎందుకంటే.. ఏదైనా అయి హాస్పిటల్‌కి వస్తే.. వంద, వేయితో అయిపోదు.. లక్షలు ఖర్చు అవుతాయి’ అంటూ పింకీ ఎమోషనల్‌గా మాట్లాడింది. తనకు ఈ టైమ్‌లో కాజల్‌, యాంకర్‌ శివ, వాళ్ల డైరెక్టర్‌, సిరి హన్మంత్‌ ఇంటికి వచ్చి తనను ఎప్పటికప్పుడు బాగా చూసుకున్నారని, తన అన్న వదిలనలు కూడా ఇక్కడికి వచ్చేశారంటూ ఆస్పత్రి బెడ్‌పై నుంచే వీడియో రివీజ్‌ చేసింది పింకీ. మరి పింకీకి ఇలాంటి పరిస్థితి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి