iDreamPost

ఇండియన్ సినిమాలో ఎన్నడూ జరగనిది

ఇండియన్ సినిమాలో ఎన్నడూ జరగనిది

నిజానికి కరోనా రెండుసార్లు తెచ్చిన విపత్తు అంతా ఇంతా కాదు. దాని తాలూకు పరిణామాలు ఇప్పటికీ అనుభవిస్తున్న పరిశ్రమల్లో సినిమా ఒకటి. లాక్ డౌన్ అయ్యాక కూడా ఆ ప్రభావం నుంచి బయటపడలేక ఇబ్బందులు పడుతూనే ఉంది. దానికి ఉదాహరణ రేపు రిలీజ్ కాబోతున్న బెల్ బాటమ్. బాలీవుడ్ చరిత్రలో మొదటిసారి ప్రధాన వాణిజ్య కేంద్రమైన మహారాష్ట్రలో అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరో నటించిన సినిమా రిలీజ్ కావడం లేదు. ముంబై సహా ప్రధాన నగరాల్లో సైతం ఎక్కడా దీని ప్రదర్శనకు అక్కడి సర్కారు అనుమతులు ఇవ్వలేదు. విడుదల సమయానికి ఏమైనా ఛాన్స్ ఉందనుకుంటే ఆ ఆశలు ఆవిరయ్యాయి.

ముంబై ఒకటే కాదు పూణే, కొల్హాపూర్, నాగ్ పూర్, నాసిక్, ఔరంగాబాద్, సోలాపూర్, చంద్రాపూర్, అహ్మద్ నగర్ తదితర పట్టణాల్లో ఎక్కడా సినిమాలు ఆడించడం లేదు. దీని వల్ల బెల్ బాటమ్ టీమ్ నష్టపోతున్న మొత్తం కోట్లలో ఉండబోతోంది. ఇంతే కాదు కేరళ లాంటి రాష్ట్రాల్లో సైతం ఇంకా అనుమతులు ఇవ్వకపోవడంతో అక్కడా రెవిన్యూ లాస్ అవుతోంది. కానీ తప్పని పరిస్థితుల్లో నిర్ణయం వెనక్కు తీసుకోలేక రిలీజ్ కు ముందుకు కదిలారు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం చాలా తక్కువ గ్యాప్ లో ఓటిటి ప్రీమియర్ ఉండబోతోందని, అది ముందుగానే చెప్పేస్తే ఓపెనింగ్స్ మీద ప్రభావం ఉంటుందని దాచి ఉంచారట.

మొత్తానికి ఇలా ఇంత భారీ ఎత్తున విడుదలవుతున్న సినిమా ముంబైని మిస్ చేసుకోవడం మాత్రం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడో లేదా దేశవ్యాప్తంగా బందుల వల్ల థియేటర్లు అక్కడ మూసేయడం సహజమే కానీ ఇండియా అంతా సినిమా రిలీజై మెయిన్ బిజినెస్ సెంటర్ లో లేకపోవడం మాత్రం ఫస్ట్ టైం. ఏదైతేనేం బెల్ బాటమ్ నిర్మాతలు సాహసం చేస్తున్నారు. నాలుగు రోజుల వీకెండ్ కోసమే సాంప్రదాయానికి భిన్నంగా శుక్రవారం బదులు గురువారమే విడుదల చేస్తున్నారు. మరి దీని ఫలితం ప్లస్ కలెక్షన్లను బట్టి మిగిలిన నిర్మాతలు నిర్ణయాలు తీసుకోబోతున్నారు. లెట్ సి

Also Read :  టాలీవుడ్ లో ఫహద్ ప్లానింగ్ బాగుందే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి