iDreamPost

RRR : చరణ్ తారక్ అభిమానులకు పండగే

RRR : చరణ్ తారక్ అభిమానులకు పండగే

గత నెల వాయిదా పడిన ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ఫ్రెష్ కౌంట్ డౌన్ మళ్ళీ స్టార్ట్ అయ్యింది. విడుదలకు యాభై రోజుల కంటే తక్కువ సమయం ఉండటంతో రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆతృతతో ఆ డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. రాజమౌళి టీమ్ ఫ్రెష్ గా ప్రమోషన్లు స్టార్ట్ చేయనప్పటికీ ముంబై ఈవెంట్ తాలూకు పూర్తి వీడియోలను అందుబాటులోకి తెచ్చి మరోసారి హైప్ ని పెంచే ప్రయత్నం చేసింది. ఈ వేడుక గత నెలే యూట్యూబ్ లో అందుబాటులోకి వచ్చినప్పటికీ శాటిలైట్ టెలికాస్ట్ కోసం పూర్తి స్పీచులను అప్ లోడ్ చేయలేదు. ఇప్పుడా లోటుని భర్తీ చేస్తూ వాటిని వదలడంతో ఫాన్స్ కు కొత్త విషయాలు తెలుస్తున్నాయి.

అందులో ప్రధానమైంది జక్కన్న చెప్పిన సెకండ్ హాఫ్ ఎపిసోడ్ ఒకటి. అది వచ్చినప్పుడు హార్ట్ బీట్ అమాంతం ఆగిపోతుందని, గూస్ బంప్స్ అంటే ఏంటో అసలైన అర్థం తెలిసివచ్చేలా నరాలు తెగిపోయే టెంపోతో అది ఉంటుందని తెగ ఊరించేశాడు. అది ఏ సందర్భంలో వస్తుందనేది మాత్రం చిన్న క్లూ కూడా ఇవ్వలేదు. ఇన్ సైడ్ టాక్ ప్రకారం అది చరణ్ తారక్ లు కలిసి బ్రిటిషర్ల స్థావరాల మీద దాడి చేసి ఊచకోతకు కారణమైన ఆఫీసర్లను ప్రాణాలకు తెగించి చంపేసే ఎపిసోడట. వీళ్ళ కాంబినేషన్ ఇక్కడే పీక్స్ కు వెళ్ళిపోతుందని ఇక ఫ్యాన్స్ కు కలిగే భావోద్వేగాలను వర్ణించడం కష్టమని దీన్ని దగ్గరి నుంచి చూసినవాళ్లు అంటున్నారు

ఇది నిజమా కాదా అని చెప్పడానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ ఏమి లేదు కానీ లీకైన దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దీంతో పాటు ట్రైన్ బ్లాస్టింగ్ ఎపిసోడ్ లో ఇద్దరు కలిసి జెండాను పట్టుకునే యాక్షన్ బ్లాక్ కూడా ఇదే స్థాయిలో ఉంటుందట. మొత్తానికి బెస్ట్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం ఆడియన్స్ తహతహలాడిపోతున్నారు. కొత్తగా ఏమైనా ప్రమోషన్స్ చేస్తారని ఎదురు చూస్తున్న ఫాన్స్ కు ఇంకా ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పలేదు. హైదరాబాద్ లో ప్రస్తుతం ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 25 తర్వాతే దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ ఇవ్వబోతున్నారు.

Also Read : Jai Bhim : అతి గొప్ప గౌరవానికి దగ్గరగా సౌత్ సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి