iDreamPost

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ISRO! ప్రపంచంలోనే రెండో మిషన్..

ISRO Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. అంతేకాక ఇస్రో చేపట్టనున్న ఈ మిషన్ ప్రపంచంలోనే రెండోవది గా నిలవనుంది. మరి.. ఆ పరిశోధన ఏమిటి.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ISRO Mission: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మకమైన ప్రయోగానికి సిద్ధమైంది. అంతేకాక ఇస్రో చేపట్టనున్న ఈ మిషన్ ప్రపంచంలోనే రెండోవది గా నిలవనుంది. మరి.. ఆ పరిశోధన ఏమిటి.. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైన ISRO! ప్రపంచంలోనే రెండో మిషన్..

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అధ్బుతమైన ప్రయోగాలతో ప్రపంచంలో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసింది ఇస్రో. అమెరికా, రష్యా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కానీ ఎన్నో పరిశోధనల్లో ఇస్రో ఘన విజయం సాధించింది. కొంత కాలం క్రితం చంద్రయాన్-3 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఆ పరిశోధనతో వచ్చిన సక్సెస్ ఇస్రో కీర్తి ఎవరెస్టు స్థాయికి  ఎదిగింది. ఈ నేపథ్యంలోనే ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. ఈ ప్రయోగం ప్రపంచంలోనే రెండో  మిషన్ గా నిలవనుంది. మరి.. ఆ ప్రయోగం ఏమిటి? ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇస్రో ఎక్స్ కిరణాల అధ్యయనానికి తొలిసారి పొలారిమెట్రీ మిషన్‌ను చేపట్టబోతుంది. డిసెంబరు 28న ఈ ప్రయోగాన్ని నిర్వహించనున్నట్టు ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు. కిరాణాల్లో అతి ముఖ్యమైన, ప్రత్యేకమైన ఎక్స్ కిరణాల మూలాల పోలరైజేషన్‌ అధ్యయనం కోసం ఈ మిషన్ చేపడుతున్నట్టు వెల్లడించారు. అతి శక్తివంతమైన ఎక్స్-కిరణాల చరిత్రను తెలుసుకునేందుకు ఇస్రో కొత్త ప్రయోగానికి సిద్ధమైంది.

ఎక్స్-కిరణాల మూలాల ధ్రువణాన్ని శోధించడమే లక్ష్యంగా  భారత్ తొలి ఎక్స్-రే పొలారిమీటర్ ఉపగ్రహ ప్రయోగానికి సిద్ధమైంది. ఇంకా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ పొలారి మీటర్ పరిశోధన గురించి పలు కీలక విషయాలను వెల్లడించారు. భారత్‌లో అంతరిక్ష ఆధారిత ఎక్స్-రే ఆస్ట్రానమీ స్థాపించాం, ప్రధానంగా ఇమేజింగ్, టైమ్ డొమైన స్టడీ తో పాటు స్పెక్ట్రోస్కోపీపై ఇది విశ్లేషిస్తుంది. ఈ రాబోయే మిషన్ ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని తెలియజేస్తోందని ఇస్రో ఓ ప్రకటనలో తెలిపింది.

కాంతి ధ్రువణాన్ని కొలిచే ఎక్స్ పోశాట్ మిషన్ అనేది భారత్ నిర్వహించే మొదటి, ప్రపంచంలో రెండో అంతరిక్ష మిషన్ గా చరిత్రలో నిలవనుంది. పొలారిమెట్రీ అనేది ఖగోళ వస్తువుల, తోకచుక్కల, సుదూరగా ఉన్న గెలాక్సీల సమాచారాన్ని తెలుసుకోవడానికి అనుమతించే శక్తివంతమైన సాధనం. ఈ మిషన్ చాలా పత్యేకమైనదని, కారణం.. సవాల్‌తో కూడుకున్న బ్లాక్ హోల్స్, న్యూట్రాన్ స్టార్స్, వంటి వివిధ ఖగోళ మూలాల ఉద్గారాలను  అధ్యాయనం చేయడానికి సహాయపడుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు తెలిపారు.

ఎక్స్ పోశాట్ మిషన్ తన రెండు పేలోడ్‌ల ద్వారా ఎంతో శక్తివంతమైన ఎక్స్ కిరణాల మూలాల టెంపోరల్, స్పెక్ట్రల్, పొలరైజేషన్ లక్షణాలను ఏకకాలంలో స్టడీ చేయగలదు. ఎక్స్-రే మూలాల నుంచి వెలువడే 8-30 కేవీ బ్యాండ్‌లో ఎక్స్- కిరణాల ధ్రువణాన్ని కొలవడం, 0.8-15 కేవీ వ్యవధిలోని కాస్మిక్ ఎక్స్-కిరణాల మూలాల దీర్ఘకాలిక స్పెక్ట్రల్, టెంపోరల్ స్టడీస్ చేస్తుంది. దాదాపు ఐదేళ్లపాటు సేవలందించేలా దీనిని  ఇస్రో రూపొందించారు.

ఎక్స్ పోశాట్ పేలోడ్‌లు గ్రహణ కాలంలో భూమి నీడ ద్వారా ప్రయాణించే సమయంలో ఎక్స్ రే మూలాలను గమనిస్తాయని ఇస్రో పేర్కొంది. POLIX పేలోడ్‌ను ఇస్రో సహకారంతో బెంగళూరులోని రామన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. అదేవిధంగా XSPECT పేలోడ్‌ను ఇస్రోలోని ఓ సంస్థ అయినా యూఆర్ రావు శాటిలైట్ సెంటర్ అభివృద్ధి చేసింది. అతి ప్రతిష్టాత్మక ప్రయోగం మరికొద్ది రోజుల్లో ప్రారభం కానుంది. మరి.. ఈ మిషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి