iDreamPost

రాజకీయ విమర్శలకు సమయం సందర్భం ఉండదా కేశినేని నాని గారు ?

రాజకీయ విమర్శలకు సమయం సందర్భం ఉండదా కేశినేని నాని గారు ?

కేంద్రం ఇచ్చిన లాక్ డౌన్ సడలింపు కారణంగా ఈ రోజు తెల్లవారుజామున విశాఖలో ఉన్న సౌత్ కొరియా పరిశ్రమ అయిన ఎల్జీ పాలిమర్స్‌ తెరవబోతుండగా.. స్టైరిన్ గ్యాస్ లీకై చుట్టుపక్కల ఉన్న వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు, 8 మంది చనిపోయినట్టు తెలుస్తుంది . దీంతో వైజాగ్‌లోని గోపాలపట్నం పరిధిలో కెమికల్ లీక్ వలన ప్రభావితం అయ్యే ప్రాంతాలను ప్రభుత్వం తక్షణం ఖాళీ చేయించే పనిలో ఉన్నారు. NDRF,SDRF టీంలు సహయక చర్యలు చేపట్టాయి.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ఈ గ్యాస్ లీక్ అవ్వడానికి కారణం ఫ్యాక్టరీలో కెమికల్ , లాక్ డౌన్ కన్నా ముందు నుండి స్టాక్ లో ఉండిపోవడం, లాక్ డౌన్ కారణంగా స్టాక్ లో ఉన్న కెమికల్ ని వాడే అవకాశం లేకపోవడం జరిగింది . అయితే ప్రధాని లాక్ డౌన్ ని సడలిస్తూ కొన్ని పరిశ్రమలు తిరిగి ప్రారంభించడానికి అనుమతి ఇవ్వడం అందులో ఈ ఎల్.జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ కూడా ఉండటంతో వారు తిరిగి ఫ్యాక్టరీని పారంభించే ప్రయత్నం చేశారు. దీంతో స్టాక్ లో ఉండిపోయిన కెమికల్ ఒక్కసారిగా లీకై ఈ విపత్తు సంభవించింది.

అయితే ఈ దురదృష్టకర ఘటన జరగడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం కానీ నిర్లక్ష్యం కానీ సూది మొనంత లేకపోయినా ఇలాంటి దురదృష్ట సమయంలో కూడా కేశినేని నాని లాంటి ప్రతిపక్ష నేతలు మానవీయకోనాన్ని మరిచి రాజకీయమే పరమావదిగా ప్రభుత్వం పై విమర్శలు చేయడం శోచనీయం. ప్రజలకి హాని కలిగే అనుకోని విపత్తు సంభవించినప్పుడు ప్రజాప్రతినిధులంతా ఏకత్రాటిపై నిలిచి ప్రజలకు మనోదైర్యం కల్పించే పనులు చేయకపోగా, జరిగిన ఘటనలో వాస్తవాలను తెలుసుకోకుండా ఇలా విమర్శలు చేసి ప్రజలను మరింత గందరగోళానికి గురయ్యేలా వ్యవహరించడం అత్యంత బాధాకరం. ఇలాంటి విమర్శలు ఇప్పుడు ఉన్న క్లిష్ట పరిస్థితుల్లో హర్షించదగ్గవి కావు అని ప్రతిపక్ష నాయకులు తెలుసుకుంటే మంచిది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి