iDreamPost

Laal Singh Chaddha Movie లాల్ సింగ్ చద్దా కథ ఆన్‌లైన్‌లో లీక్? అమీర్ ఖాన్ సినిమా క‌థ‌ 1984 సిక్కు అల్లర్లు, బాబ్రీ విధ్వంసం, ఎమెర్జెన్సీ చుట్టూ తిరుగుతుందా?

Laal Singh Chaddha Movie లాల్ సింగ్ చద్దా కథ ఆన్‌లైన్‌లో లీక్? అమీర్ ఖాన్ సినిమా క‌థ‌ 1984 సిక్కు అల్లర్లు, బాబ్రీ విధ్వంసం, ఎమెర్జెన్సీ చుట్టూ తిరుగుతుందా?

లాల్ సింగ్ చద్దా సినిమాను బ్యాన్ చేయాలంటే నెగిటీవ్ ప్ర‌చారం గ‌ట్టిగానే సాగింది. అదేంటో రెండురోజులుగా డోసు బాగా త‌గ్గింది. రీజ‌న్, ఈ సినిమా అధికార‌పార్టీకి న‌చ్చిన‌ట్లే ఉంద‌న్న‌ది బాలీవుడ్ వ‌ర్గాల టాక్. అమీర్ ఖాన్ , కరీనా కపూర్ ఖాన్ ప్రధాన పాత్రలలో, నాగ చైతన్య , మోనా సింగ్ కీలక పాత్రలు పోషించారు. లాల్ సింగ్ చద్దా హాలీవుడ్ చిత్రం ఫారెస్ట్ గంప్ అఫీషియ‌ల్ రీమేక్. ఈ సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 11న సినిమా విడుదల కానుంది. ఇప్ప‌టికే బ‌జ్ చాలా పీక్ కెళ్లిపోయింది. ఈ సినిమాను స్థానిక థియేట‌ర్ల‌లో ప్ర‌ద‌ర్శించేందుకు యూపీ అధికార పార్టీ, భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు ట్రైచేస్తున్నారు. కార‌ణం…రాజ‌కీయాలేనా? 1984 నాటి సిక్కు అల్లర్లపై దృష్టిపెట్టిన ఈ సినిమాలో అనేక వాస్త‌వ ఘ‌ట‌న‌లు క‌నిపిస్తాయి. ఇప్పటికీ అమీర్ ఖాన్ సినిమాను బ్యాన్ చేయాల‌ని సోష‌ల్ మీడియాలో వాదిస్తున్న‌వాళ్లు చాలామందే ఉన్నారు. కాని, లాల్ సింగ్ చద్దా షూటింగ్ స‌మ‌యంలోని అనేక ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వారణాసి ఘాట్‌లపై ‘అబ్ కి బార్ మోడీ సర్కార్స వంటి బిజెపి నినాదాలు క‌నిపించాయి. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోదీ స్వచ్ఛతా ప్రచారం కూడా సినిమాలో క‌నిపిస్తుంది.

లాల్ సింగ్ చద్దా సినిమా కథ 1984 నాటి సిక్కు అల్లర్ల మీద ఫోక‌స్ చేసింది. ఈ దురదృష్టకర సంఘటనేకాదు, ముంబై బాంబు పేలుళ్లు, అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతను చూపించాయి. ఈ ఘ‌ట‌న‌లకు లాల్ సింగ్ సాక్షిగా ఉంటాడు. అంతేనా? కాంగ్రెస్ హయాంలోని ఎమర్జెన్సీపై కూడా ఈ సినిమా తీవ్ర‌మైన వ్యాఖ్య‌లు చేసింది. అందుకే బీజేపీ న‌చ్చే సినిమా అవుతుంద‌న్న‌ది ఇప్ప‌టికే ఈ సినిమాను చూసిన‌వాళ్లు అంటున్నారు. పాక్ ప్రేరేపిత తీవ్ర‌వాదం గురించిన ప్ర‌స్తావ‌న కూడా ఉంది. తీవ్రవాదం కోసం శిక్షణ పొందుతున్న యువతను చూపించే మొద‌టి హిందీ సినిమా అవుతుంది. ఈ సినిమాలో, పాకిస్తాన్ సైనికుడు, తన స్వదేశానికి తిరిగి వెళ్లి ప్రజలకు నిజమైన భారతదేశం గురించి చెప్పాలనుకుంటున్నట్లు చూపించారు.

అమీర్‌ఖాన్‌కు జోడీగా కరీనా కపూర్‌ ఖాన్‌ ప్రధాన పాత్రలో కనిపించింది. సామాజిక ఆచార వ్యవహారాలపై నమ్మకం లేని రెబల్‌గా, సినిమాలో క‌రీనా పాత్ర‌ను మ‌లిచారు. ఈ పాత్ర డ్రగ్ ట్రాప్‌లో చిక్కుకుటుంది. అమీర్ పాత్ర ఆమెతో ప్రేమలో పడుతుంది. ఒక రాత్రి రూపా పాత్ర లాల్ సింగ్ ను క‌ల‌వ‌డానికి వ‌చ్చి అతని బిడ్డకు తల్లి అవుతుంది. ఇండియాలో పెళ్లికాకుండా త‌ల్ల‌యితే ఎంత సంచ‌ల‌న‌మో తెలుసుక‌దా! కరీనా పాత్ర వాస్తవ సంఘటనల ఆధారంగా తీర్చిదిద్దారు.

 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి