iDreamPost

చంద్రబాబుకు మళ్లీ జైలు!.. జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో  మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. 52 రోజుల తరువాత మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి జైలుకు వెళ్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో  మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. 52 రోజుల తరువాత మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి జైలుకు వెళ్తారనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది.

చంద్రబాబుకు మళ్లీ జైలు!.. జర్నలిస్ట్ సాయి కీలక వ్యాఖ్యలు!

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో  మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అయిన సంగతి తెలిసిందే. ఆయన దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా గడిపారు. అనంతరం ఆయన ఆరోగ్యం విషయంలో హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన బయటకు రావడంతో టీడీపీ శ్రేణులు సంతోషం వ్యక్తమైంది. ఆయన దేని కోసం అయితే బెయిల్ మంజూరు చేశారో ఆ పని పూరైంది. ఇటీవలే చంద్రబాబు కంటికి చికిత్స చేశారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లాల్సిదేనా అనే సందేహం అందరిలో వ్యక్తమవుతుంది. అంతేకాక చంద్రబాబు జైలుకు వెళ్లడం తప్పదని మరికొందరు గట్టిగానే చెబుతున్నారు.

టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు 28వ తారీఖు వరకు మధ్యంతర బెయిల్ ను హైకోర్టు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన కంటి చికిత్స నిమిత్తం వచ్చిన పని పూర్తైంది. అంతేకాక 28వ తేదీ వరకు విశ్రాంతి కూడా తీసుకునే అవకాశం ఉంది. ఆ తరువాత మాత్రం ఆయన జైలుకు వెళ్తారని పొలిటికల్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు జైలుకు వెళ్లే అంశంపై ప్రముఖ జర్నలిస్ట్ సాయికి కీలక విషయాలను తెలిపారు.

ఆయన మాట్లాడుతూ..” ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు సంబంధించి ఆ టెన్షన్ అలానే సాగుతుంది. ప్రస్తుతం ఆయన ఆయన బెయిల్ పై ఉన్నారు. ఆయన కు ఇచ్చిన కంటి ఆపరేషన్ బెయిల్ 28 దాకనే ఉంది. ఆ కంటి చికిత్స కూడా పూరైంది. ఇక ఆయన చర్మ సమస్యలకు సంబంధించిన విషయానికి వస్తే.. అది నిత్యం ఉండేది. దానికి చికిత్స ఎలాగో తీసుకుంటున్నారు. కాబట్టి..28వ తేదీన సాయంత్రానికి చంద్రబాబు జైలుకు వెళ్లాలి. ఇక ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో విచారణ 30వ తేదీకి వాయిదా పడింది.

దీంతో ఇక చంద్రబాబు జైలుకు తప్పనిసరి పరిస్థితి అవుతుంది. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ అంశంపై కోర్టు తీర్పు ఇవ్వలేదు. గురువారం ఇస్తారు అనుకుంటే.. ఇవ్వలేదు. ఈ కేసులో దీపావళి తరువాత తీర్పు ఇస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. దీపావళి తరువాత  అనడానికి కూడ ఓ బలమైన కారణం ఉంది. ఇప్పటికే 17A అంశానికి సంబంధించి ప్రశాంత్ భూషన్ కేసు ఒకటి కోర్టులో ఉంది. ఆ కేసు తీర్పు వచ్చిన తరువాత చూద్దామని న్యాయమూర్తులు భావించి ఉండొచ్చు.

ఇక 28లోపు ఆ కేసులో తీర్పు వచ్చి.. అందులో కూడా 17A  క్వాష్ అయితే  మాత్రమే చంద్రబాబు బయట ఉండే అవకాశం ఉంటుంది. లేకుంటే చంద్రబాబు తిరిగి జైలుకు వెళ్లాల్సి వస్తుంది” అని సాయి అన్నారు. అంతేకాక కానీ ఈ కేసు విషయంలో 28లోపు ఏం జరుగుతుందే చూడాల్సి ఉందంటూ జర్నలిస్టు సాయి చెప్పుకొచ్చారు. మరి.. చంద్రబాబు మళ్లీ జైలుకు వెళ్తారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి