iDreamPost

జగపతిబాబులాగే రాజశేఖర్ కూడా ?

జగపతిబాబులాగే రాజశేఖర్ కూడా ?

చిన్న సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఆహుతితో పేరు తెచ్చుకుని అంకుశంతో స్టార్ డం తెచ్చుకున్న ఒకప్పటి యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ కున్న మాస్ ఫాలోయింగ్ ని మరీ తీసిపారేయలేం. లవ్ బాయ్ గానూ అల్లరి ప్రియుడు లాంటి బ్లాక్ బస్టర్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి. సాయి కుమార్ తనకు డబ్బింగ్ చెప్పడం మానేశాక కొంత స్లో అయినప్పటికీ మా అన్నయ్య, సూర్యుడు, గోరింటాకు లాంటి సూపర్ హిట్లతో బండిని బాగానే నెట్టుకుంటూ వచ్చారు. ఎవడైతే నాకేంటి సక్సెస్ అయినా ఆ తర్వాత కథల ఎంపికలో చేసిన తడబాటుతో పాటు ఇతరత్రా కారణాల వల్ల మొత్తంగా నెమ్మదించారు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్.

కట్ చేస్తే కొంత ఆలస్యంగానే అయినా గరుడవేగాతో మంచి విజయం అందుకున్న రాజశేఖర్ అది కమర్షియల్ గా పెద్ద రేంజ్ కు వెళ్ళకపోవడం ఇబ్బంది పెట్టింది. బడ్జెట్ ని ఎక్కువ పెట్టి తీసిన కల్కి నిరాశ పరచడంతో కొంత గ్యాప్ తీసుకున్నారు. ప్రస్తుతం ఓ మలయాళం రీమేక్ తో పాటు మరో సినిమా చేస్తున్న ఈ యాంగ్రీ మ్యాన్ కొత్తగా జగపతిబాబు తరహాలో విలన్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాలనే ఆలోచన గట్టిగా చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. గోపీచంద్ శ్రీవాస్ కాంబినేషన్ లో రూపొందబోయే మాస్ ఎంటర్ టైనర్ లో రాజశేఖర్ ని ప్రతినాయకుడిగా నటించమని అడిగారట. పాజిటివ్ గానే ఉన్నట్టు వినికిడి.

గతంలో రామ్ చరణ్ ధృవకు సైతం ముందు రాజశేఖర్ నే అనుకున్నారు. ఆయన చేసి ఉంటే ఇప్పుడు పరిస్థితి వేరేలా ఉండేదేమో. కానీ రీమేక్ సానుకూలత కోసం అరవింద్ స్వామినే కొనసాగించారు. స్నేహం కోసంలో విజయ్ కుమార్ చేసిన క్యారెక్టర్ కు సైతం మొదటి ఆప్షన్ రాజశేఖరే. కానీ ఫామ్ లో ఉన్నప్పుడు ఇలాంటి ఏజ్డ్ క్యారెక్టర్స్ వద్దని చిరంజీవి వారించడం వల్ల అది జరగలేదని అప్పట్లో మీడియాలో వచ్చింది. మొత్తానికి ఇది నిజమైతే మంచి నిర్ణయమే అని చెప్పాలి. జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి నిన్నటి హీరోల బాటలో రాజశేఖర్ వెళ్లాలనుకోవడం రైటే. కాకపోతే అఫీషియల్ అయ్యేదాకా చూడాలి మరి

Also Read : గోపీచంద్ సినిమా రూటు ఎటు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి