iDreamPost

IRCTC:  అందులో రద్దు చేసి.. ఇందులో ఛార్జీలు పెంచింది

IRCTC:  అందులో రద్దు చేసి.. ఇందులో ఛార్జీలు పెంచింది

మీరు తరచుగా ప్రీమియం రైళ్ళలో ప్రయాణిస్తారా? వాటిలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపిస్తారా? అయితే ఈ వార్త మీకోసమే. ఐఆర్సీటీసీ ఇప్పుడు సర్వీస్ ఛార్జీలపై కొన్ని కొత్త మార్పులు చేసింది.

ఇప్పటివరకు టీ, కాఫీలను టికెట్ రిజర్వేషన్ సమయంలోనే ప్రీ బుక్ చేసుకోకుండా, ప్రయాణించేటప్పుడు ఆర్డర్ చేసేవారికి ప్రతి కప్పుకు రూ.50 సేవా రుసుము వసూలు చేస్తోంది. తాజాగా ప్రయాణీకులు అప్పటికప్పుడు ఆర్డర్ చేసేవాటిపై రుసుమును రద్దు చేసింది.

ప్రిమీయం రైళ్ళలో రూ.20 కప్పు టీ కోసం మొత్తం రూ.70 చెల్లించేవారు ప్రయాణీకులు. తాజా రూల్స్ ప్రకారం ముందుగా బుక్ చేసుకున్నా, చేసుకోకపోయినా పానియాలన వరకు సేవా రుసుమును తీసేయాలని నిర్ణయించింది.

అయితే రాజధాని, దురంతో, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్ళలో అల్పాహారం, మధ్యా హ్న, రాత్రి భోజనాల ధరలను మాత్రం రూ.50 చొప్పున పెంచుతున్నట్లుగా తెలిపింది. ఆహారాన్ని ముందుగా బుక్ చేసుకున్నా, అప్పటికప్పుడు ఆర్డర్ ఇచ్చినా ఒకే ధర వర్తించేలా కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి