iDreamPost

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు

సార్వత్రిక , పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లిక్కర్ ధరలు పెరగగా.. తాజాగా మరికొన్ని రాష్ట్రాలు కూడా అవే దారిన పట్టాయి. ఇంతకు ఎంతంటే..?

సార్వత్రిక , పలు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల ముంగిట.. మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లిక్కర్ ధరలు పెరగగా.. తాజాగా మరికొన్ని రాష్ట్రాలు కూడా అవే దారిన పట్టాయి. ఇంతకు ఎంతంటే..?

మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన ధరలు

మద్యం ప్రియులకు ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి షాక్ తగలనుంది. తీర్థం కాస్త ఎక్కువ తీసుకోవాలనుకుంటే.. ఈ సారి కాస్త ఆలోచించాల్సి వస్తుందేమో మరీ. ఎందుకంటే కొత్త ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వస్తుంది. ఆ పాలసీతో మాకేంటీ పని.. మేము మాత్రం ఎంత తాగాలనుకుంటే.. అంతే డ్రింక్ చేస్తామని అనుకుంటున్నారా..? అలాగే కానీ ఇంతక ముందులా మాత్రం అంత మోతాదులో మద్యం రాకపోవచ్చు. ఈ కొత్త మద్యం పాలసీతో ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ మద్యం పాలసీని అమలు చేస్తున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాలు కూడా సొంత లిక్కర్ పాలసీలను అమలు చేసుకుంటున్నాయి. కాగా, ఈ ఏప్రిల్ 1 నుండి మరో మూడు రాష్ట్రాలు కూడా ఆ జాబితాలో చేరిపోయాయి.

ఉత్తరప్రదేశ్, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఏప్రిల్ ఒకటి నుండి న్యూ ఎక్సైజ్ పాలసీ అమల్లోకి వచ్చింది. దీంతో ఈ రాష్ట్రాల్లో లిక్కలు ధరలు పెరిగాయి. సార్వత్రిక ఎన్నికల ముంగిట లిక్కర్ రేట్స్ పెరగనున్నాయి. ధరలు పెంచిన మూడు రాష్ట్రాలు బీజెపీ పాలిత స్టేట్స్ కావడం గమనార్హం. యుపిలో మద్యం ధరను కనీసం ఐదు రూపాయలు పెంచారు. ప్రస్తుతం రూ. 65 ఉన్న లిక్కర్ బాటిల్.. ఇప్పుడు రూ. 75కు చేరుకుంది. బీరు బాటిల్ పై రూ. 10 పెరిగింది. అలాగే పవ్వారకం లిక్కర్ బాటిల్ పై రూ. 15 పెంచింది యోగి సర్కార్. దీంతో బాటిల్ ధర రూ. 90 అయ్యింది. ఇక విదేశీ మద్యం ధరలు రూ. 15 నుండి రూ. 25 రూపాయల వరకు పెరిగాయి. చత్తీస్ ఘడ్ లో అయితే కనిష్టంగా రూ. 10, గరిష్టంగా రూ. 40 పెంచింది అక్కడి బీజెపీ సర్కార్.

Bad news for alcohol lovers

దేశంలో తయారయ్యే మందు బాటిల్ ధరను రూ. 10 పెంచగానే.. వెంటనే విదేశ బ్రాండ్ ధరలను 40 రూపాయలకు పెంచేసింది.ఇక మధ్య ప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్క కూడా రూ. 150 నుండి రూ. 200 వరకు పెరగడం గమనార్హం. రూ. 15 వేల కోట్ల అదనపు ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలోని బీజెపీ ప్రభుత్వం భారీగానే లిక్కర్ ధరలు పెంచింది. కనీస ధరను 15 శాతం పెంపుదల చేసింది సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని సర్కార్.రాజధాని నగరి భోపాల్‌ను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. రాష్ట్రంలో అత్యధికంగా లిక్కర్ అమ్ముడవుతున్న నగరం ఇదే. ఈ నగరం నుండే వెయ్యి కోట్ల రూపాయల అమ్మకాలు రాబట్టుకోవాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి