iDreamPost

IPL Auction 2024: రింకూ చేతిలో బలైన బౌలర్​కు జాక్​పాట్.. పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన RCB

  • Published Dec 20, 2023 | 10:40 AMUpdated Dec 20, 2023 | 10:40 AM

పించ్ హిట్టర్ రింకూ సింగ్ చేతిలో గత ఐపీఎల్​లో ఓ బౌలర్ బలైన సంగతి తెలిసిందే. అయితే ఆ పేసర్​కు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

పించ్ హిట్టర్ రింకూ సింగ్ చేతిలో గత ఐపీఎల్​లో ఓ బౌలర్ బలైన సంగతి తెలిసిందే. అయితే ఆ పేసర్​కు పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

  • Published Dec 20, 2023 | 10:40 AMUpdated Dec 20, 2023 | 10:40 AM
IPL Auction 2024: రింకూ చేతిలో బలైన బౌలర్​కు జాక్​పాట్.. పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చిన RCB

ఇండియన్ ప్రీమియర్ లీగ్ మినీ వేలం అనుకున్న దాని కంటే చాలా రసవత్తరంగా సాగింది. భారీ ధరకు పోతారనుకున్న కొందరు ప్లేయర్లను అసలు ఏ జట్టూ పట్టించుకోలేదు. ఓ మాదిరి ధరకు పోతారనుకున్న వారిని రూ.కోట్లకు రూ.కోట్లు ఖర్చు పెట్టి మరీ దక్కించుకున్నాయి ఫ్రాంచైజీలు. ఈసారి ఆక్షన్​లో బౌలర్లకు మంచి గిరాకీ పలికింది. ఆస్ట్రేలియా క్రికెటర్లు ప్యాట్ కమిన్స్ (రూ.20.50 కోట్లు), మిచెల్ స్టార్క్ (24.75 కోట్లు) జాక్​పాట్ కొట్టేశారు. పదహారేళ్ల లీగ్ చరిత్రలో అత్యంత భారీ ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా స్టార్క్ రికార్డు సృష్టించాడు. ఈసారి బౌలర్ల కోసం భారీగా బిడ్డింగ్​ చేశాయి టీమ్స్. ఇది ఒక ప్లేయర్​కు బాగా కలిసొచ్చింది. అతడే యష్ దయాల్. ఒకట్రెండు కోట్లకు పోయినా గొప్పే అనుకుంటే అతడ్ని ఊహించని ధరకు తీసుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.

యష్ దయాల్​ను ఏకంగా రూ.5 కోట్లు ఖర్చు పెట్టి మరీ టీమ్​లోకి తెచ్చుకుంది ఆర్సీబీ. గత ఆక్షన్​లో రూ.3.2 కోట్లకు అమ్ముడుపోయిన దయాల్​కు ఇంత ధర పెట్టడం కాస్త సాహసమనే చెప్పాలి. ఎందుకంటే ఈ ఏడాది ఐపీఎల్​లో అతడు గుజరాత్ టైటాన్స్​కు ఆడాడు. అయితే కోల్​కతా నైట్ రైడర్స్​తో జరిగిన ఓ మ్యాచ్​లో బాగా పరుగులు సమర్పించుకున్నాడు. యష్ వేసిన ఓ ఓవర్​లో కేకేఆర్ పించ్ హిట్టర్ రింకూ సింగ్ వరుసగా 5 సిక్సులు బాదాడు. ఆ మ్యాచ్ తర్వాత అనారోగ్యం కారణంగా అతడు జట్టుకు దూరమయ్యాడు. రింకూ విధ్వంసం నుంచి చాన్నాళ్ల వరకు బయటపడలేకపోయాడు యష్. ఈ క్రమంలో ఏకంగా 7 నుంచి 8 కిలోలు బరువు కూడా తగ్గాడు. దీంతో ఈసారి వేలంలో అతడ్ని ఎవరూ తీసుకోకపోవచ్చని అనుకున్నారు. కానీ అతడి కోసం భారీగా బిడ్ చేసి సొంతం చేసుకుంది ఆర్సీబీ.

jackpot for yash dayal

 

రింకూ చేతిలో బలైన యష్​ కోసం బెంగళూరు ఇంతగా ఖర్చు చేయడానికి ఓ కారణం ఉంది. గత ఐపీఎల్​లో ఫెయిలైనప్పటికీ ఆ తర్వాత డొమెస్టిక్ క్రికెట్​లో రాణించాడు యష్ దయాల్. విజయ్ హజారే ట్రోఫీతో పాటు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నమెంట్​లోనూ సత్తా చాటాడు. దీంతో అతడ్ని తీసుకోవాలని అనుకుంది ఆర్సీబీ. లెఫ్టార్మ్ పేసర్ కావడం, బంతిని మంచి లైన్ అండ్ లెంగ్త్​తో సరైన ఏరియాలో పిచ్ చేసే సత్తా ఉండటంతో యష్​ కోసం పట్టుబట్టింది. ఈ స్పీడ్​స్టర్ టీమ్​లోకి రావడాన్ని ఆర్సీబీ ఫ్యాన్స్ స్వాగతిస్తున్నారు. ఆల్రెడీ జట్టులో కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మ్యాక్స్​వెల్, ఫాప్ డుప్లెసిస్) ఉన్నారని.. ఇప్పుడు యష్​ కూడా వచ్చేశాడని అంటున్నారు. ఇది కేజీఎఫ్ యష్ అడ్డాగా మారిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. యష్ దయాల్​ కోసం ఆర్సీబీ రూ.5 కోట్లు ఖర్చు చేయడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPL 2024 Auction: CSKలోకి తెలుగు కుర్రాడు.. అవనీశ్​ రావుకు ఛాన్స్ ఇచ్చిన చెన్నై!

 

View this post on Instagram

 

A post shared by Sarcasm (@sarcastic_us)

 

View this post on Instagram

 

A post shared by Sportskeeda Cricket (@sportskeedacricket)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి