iDreamPost

IPL Auction 2024: టీమిండియా ప్లేయర్ కు ఊహించని ధర! ఎంతకు కొన్నారంటే?

ఐపీఎల్ 2024 వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. ఎవ్వరూ ఊహించని ధరకు పంజాబ్ అతడిని కొనుగోలు చేసి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.

ఐపీఎల్ 2024 వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. ఎవ్వరూ ఊహించని ధరకు పంజాబ్ అతడిని కొనుగోలు చేసి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.

IPL Auction 2024: టీమిండియా ప్లేయర్ కు ఊహించని ధర! ఎంతకు కొన్నారంటే?

క్రికెట్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2024 వేలం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ వేలంలో ఆటగాళ్లు కళ్లు చెదిరే ధరకు అమ్ముడౌతున్నారు. ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు. కమ్మిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 20.50 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. దీంతో గత సీజన్ లో సామ్ కర్రన్ రూ. 18.50 కోట్ల రికార్డు బద్దలైంది. అతడిని పంజాబ్ 2023 సీజన్ వేలంలో కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ఐపీఎల్ 2024 వేలంలో టీమిండియా యంగ్ ప్లేయర్ హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. ఎవ్వరూ ఊహించని ధరకు పంజాబ్ అతడిని కొనుగోలు చేసి క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.

దుబాయ్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ 2024 వేలంలో రికార్డు ధరలు నమోదు అవుతున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయాడు ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్. అతడిని సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఏకంగా రూ. 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఇదిలా ఉండగా.. ఈ వేలంలో టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్ జాక్ పాట్ కొట్టాడు. అతడిని పంజాబ్ కింగ్స్ ఎలెవెన్ జట్టు రూ.11.75 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసి ఆశ్చర్యపరిచింది. రూ.2 కోట్ల బేస్ ప్రైస్ తో వేలంలోకి వచ్చిన అతడి కోసం గుజరాత్ టైటాన్స్, పంజాబ్ జట్లు పోటాపోటీ పడ్డాయి. హోరాహోరిగా సాగిన ఈ వేలంలో చివరికి పంజాబ్ హర్షల్ పటేల్ ను దక్కించుకుంది. అద్భుతమైన బౌలింగ్ తో వికెట్లు పడగొట్టడంలో సిద్దహస్తుడు.

కాగా.. 2012 నుంచి అతడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడుతున్నాడు. 2021 ఐపీఎల్ సీజన్ లో అత్యధిక వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సాధించాడు. ఈ సీజన్ 15 మ్యాచ్ ల్లో 32 వికెట్లు పడగొట్టాడు. 2022లో కూడా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. ఆ సీజన్ లో 19 వికెట్లు తీశాడు. ఇక ఇతడి సూపర్ బౌలింగ్ తో ఆర్సీబీ ప్లేఆఫ్ కు చేరుకుంది. గతేడాది 13 మ్యాచ్ ల్లో 14 వికెట్లు పడగొట్టి పర్వాలేదనిపించాడు. పంజాబ్ జట్టు అతడిపై నమ్మకం ఉంచి.. ఊహించని ధరకు అతడిని కొనుగోలు చేసింది. మరి హర్షల్ పటేల్ కు అంత భారీ ధర దక్కడంపై మీ అభిప్రాయాను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి