iDreamPost

అదే జరిగితే కోహ్లీ అందరి కంటే ఎక్కువ కప్పులు కొట్టేవాడు: రవిశాస్త్రి

  • Published Apr 05, 2024 | 12:32 PMUpdated Apr 05, 2024 | 12:32 PM

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 17 సీజన్లుగా ఆర్సీబీకి మాత్రమే ఆడుతున్నాడు. అయినా ఒక్కసారి కూడా కప్పును అందుకోలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ హెడ్​కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 17 సీజన్లుగా ఆర్సీబీకి మాత్రమే ఆడుతున్నాడు. అయినా ఒక్కసారి కూడా కప్పును అందుకోలేదు. ఈ విషయంపై టీమిండియా మాజీ హెడ్​కోచ్ రవిశాస్త్రి రియాక్ట్ అయ్యాడు.

  • Published Apr 05, 2024 | 12:32 PMUpdated Apr 05, 2024 | 12:32 PM
అదే జరిగితే కోహ్లీ అందరి కంటే ఎక్కువ కప్పులు కొట్టేవాడు: రవిశాస్త్రి

స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్​లో 17 సీజన్లుగా ఒకే జట్టుకు ఆడుతున్నాడు. ఎవరెన్ని టీమ్స్ మారినా అతడు మాత్రం అదే టీమ్​కు స్టిక్ అయిపోయాడు. బెంగళూరు అభిమానులు ఇస్తున్న ఎంకరేజ్​మెంట్, తనపై చూపిస్తున్న ప్రేమ నచ్చి ఆ టీమ్​ను వదలడం లేదు కింగ్. అయితే ఆ జట్టు కోసం అతడు ఎంతగా రాణిస్తున్నా లాభం లేకుండా పోతోంది. ఇప్పటిదాకా ఒక్కసారి కూడా ఆర్సీబీ కప్పు కొట్టలేకపోయింది. ఈసారి కూడా ఆడిన నాలుగు మ్యాచుల్లో మూడింట ఓడి ఫ్యాన్స్​ను తీవ్రంగా నిరాశపర్చింది. కోహ్లీ 203 పరుగులతో రఫ్ఫాడించాడు. రెండు ఫిఫ్టీలు బాదిన విరాట్.. ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్​గా ఉన్నాడు. అతడు ఆడినా మిగతా వాళ్ల నుంచి సపోర్ట్ లేకపోవడంతో టీమ్​కు వరుస ఓటములు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

కోహ్లీ ఆడినా మిగతా బ్యాటర్లు, బౌలర్లు సరిగ్గా పెర్ఫార్మ్ చేయకపోవడంతో ఆర్సీబీకి ఓటములు తప్పడం లేదు. ముఖ్యంగా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్, ఆల్​రౌండర్లు గ్లెన్ మాక్స్​వెల్, కామెరాన్ గ్రీన్, లీడింగ్ పేసర్ మహ్మద్ సిరాజ్ వైఫల్యం జట్టును తీవ్రంగా వేధిస్తోంది. ఎంత బాగా ఆడినా టీమ్ ఓడిపోతుండటంతో కోహ్లీ నిరాశలో కూరుకుపోయాడు. లక్నో సూపర్ జెయింట్స్​తో మ్యాచ్​ ముగిసిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్​లో బల్లను కొడుతూ నిరుత్సాహంగా కనిపించాడు. అతడిలో ఫ్రస్ట్రేషన్ క్లియర్​గా కనిపించింది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలా జరిగి ఉంటే కింగ్ ఈపాటికే ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గేవాడని అన్నాడు. ఒకవేళ క్రికెట్ గనుక ఇండివిడ్యువల్ గేమ్ అయి ఉంటే విరాట్ దగ్గర ఎన్నో ఐపీఎల్ ట్రోఫీలు ఉండేవని చెప్పాడు.

Ravi shastri comments on kohli 2

క్రికెట్ అనేది ఒక వ్యక్తి మాత్రమే ఆడే ఆట కాదని.. ఇది టీమ్ గేమ్ అని రవిశాస్త్రి తెలిపాడు. ఇది ఇండివిడ్యువల్ స్పోర్ట్ అయి ఉంటే ఎవరి దగ్గరా లేనన్ని ఐపీఎల్​ కప్పులు కోహ్లీ దగ్గర ఉండేవని స్పష్టం చేశాడు. ఈ వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో నెటిజన్స్ ఏకీభవిస్తున్నారు. అందుకు అతడి బ్యాటింగ్ రికార్డులను ఉదహరిస్తున్నారు. ఐపీఎల్-2016లో కోహ్లీ బ్యాట్​తో అదరగొట్టాడు. ఆ సీజన్​లో ఏకంగా 973 పరుగులు చేశాడు. క్యాష్ రిచ్ లీగ్ సింగిల్ ఎడిషన్​లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్​గా ఇంకా ఈ రికార్డు పదిలంగానే ఉంది. ఇలా దాదాపుగా ప్రతి సీజన్​లోనూ బ్యాట్​తో తన పనిని అతడు నిర్వర్తిస్తున్నాడని.. కానీ మిగిలిన ఆటగాళ్ల ఫెయిల్యూర్ వల్లే టీమ్ కప్పు కొట్టడం లేదని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రవిశాస్త్రి చెప్పినట్లు పర్సనల్ గేమ్​ చూసి ట్రోఫీ ఇచ్చేటట్లు అయితే ఈపాటికే కింగ్ దగ్గర బోలెడు కప్పులు ఉండేవని అంటున్నారు. ఇకనైనా ఆటగాళ్లు అంతా కలసికట్టుగా రాణించాలని.. అప్పుడే ఆర్సీబీ కప్పు కల నెరవేరుతుందని చెబుతున్నారు.

ఇదీ చదవండి: పెళ్లైన మూడ్నెళ్లకే మరొకరితో.. షోయబ్ మాలిక్ మామూలోడు కాదు!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి