iDreamPost

ఈ IPLలో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్న టాప్‌ 7 బ్యాటర్లు వీరే!

  • Published Mar 20, 2024 | 4:19 PMUpdated Mar 20, 2024 | 4:19 PM

IPL 2024, Orange Cap: ఐపీఎల్‌ 2024 సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌లో పరుగులు వరద పారించే ఆటగాళ్లు ఎవరు, ఆరెంజ్‌ క్యాప్‌ ఎవరికి దక్కుతుంది. ఆ రేస్‌లో ఉన్న వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

IPL 2024, Orange Cap: ఐపీఎల్‌ 2024 సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. అయితే.. ఈ సీజన్‌లో పరుగులు వరద పారించే ఆటగాళ్లు ఎవరు, ఆరెంజ్‌ క్యాప్‌ ఎవరికి దక్కుతుంది. ఆ రేస్‌లో ఉన్న వాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

  • Published Mar 20, 2024 | 4:19 PMUpdated Mar 20, 2024 | 4:19 PM
ఈ IPLలో ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్న టాప్‌ 7 బ్యాటర్లు వీరే!

ఐపీఎల్‌ 2024 సీజన్‌ కోసం సర్వం సిద్ధమైంది. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా సీఎస్‌కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్‌తో ఈ ధనాధన్‌ క్రికెట్‌ లీగ్‌కు తెరలేవనుంది. మహేంద్ర సింగ్‌ ధోని, విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ లాంటి స్టార్ల సమరం కోసం క్రికెట్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. దాదాపు రెండున్నర నెలల పాటు క్రికెట్‌ ఫ్యాన్స్‌కు ఫుల్‌ వినోదాన్ని అందిస్తూ.. ఒక పండుగ వాతావరణం క్రియేట్‌ చేయనుంది ఐపీఎల్‌. అయితే.. ఈ సారి ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ అందుకునేది ఎవరనే ఆసక్తి కూడా క్రికెట్‌ అభిమానుల్లో ఉంది. మరి ఆ క్యాప్‌ను అందుకునే అవకాశం ఉన్న టాప్‌ 7 బ్యాటర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

రోహిత్‌ శర్మ..
ఈ ఏడాది ఐపీఎల్‌లో రోహిత్‌ శర్మ కేవలం బ్యాటర్‌గానే మాత్రమే బరిలోకి దిగుతున్నాడు. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా అతని స్థానంలో పాండ్యాను నియమించడంతో రోహిత్‌కు పెద్ద రిలీఫ్‌ దక్కింది. దీంతో అతను పూర్తిగా బ్యాటింగ్‌పైనే ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంది. అందుకే ఈ ఏడాది రోహిత్‌ శర్మ నుంచి భారీ భారీ స్కోర్లు ఆశించవచ్చు. ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో రోహిత్‌ శర్మ నంబర్‌ వన్‌గా ఉన్నాడు.

మ్యాక్స్‌వెల్‌..
మ్యాక్స్‌వెల్‌ కూడా ఈ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నాడు. గత కొంతకాలంగా మ్యాక్సీ ఆడుతున్న తీరు చూస్తుంటే.. ఈ సారి ఐపీఎల్‌లో అతని విశ్వరూపం చూసే అవకాశం ఉంది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లోనే మ్యాక్స్‌వెల్‌ ఎలా చెలరేగాడో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఈ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో మ్యాక్సీ నంబర్‌ టూగా ఉన్నాడు.

శుబ్‌మన్‌ గిల్‌..
గుజరాత్‌ టైటాన్స్‌కు కెప్టెన్‌గా తన అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు యువ క్రికెటర్‌ శుబ్‌మన్‌ గిల్‌. ప్రతి ఏడాది ఎంతో నిలకడగా రాణించే గిల్‌.. ఈ ఏడాది కూడా అలాంటి ప్రదర్శన చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఒక్కసారి గిల్‌ సెట్‌ అయితే.. పరుగులు చేయకుండా ఆపడం ఎవరి తరం కాదు. అందుకే ఈ ఏడాది ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో గిల్‌ నంబర్‌ త్రీగా ఉన్నాడు.

విరాట్‌ కోహ్లీ..
స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ నిలకడకు మారుపేరు. గతేడాది జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌లో కోహ్లీ ఎలాంటి ప్రదర్శన చేశాడో అంతా చూశారు. క్రికెట్‌ చరిత్రను తిరగరాస్తూ.. వన్డే వరల్డ్‌ కప్‌ చరిత్రలో ఒక ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా కోహ్లీ నిలిచాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో కోహ్లీ ఏకంగా 765 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు ఐపీఎల్‌లో కూడా కొత్త చరిత్ర లిఖించేందుకు రెడీ అవుతున్నాడు. ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీనే ఉన్నాడు. 2016 సీజన్‌లో కోహ్లీ 900కి పైగా రన్స్‌ చేశాడు. ఈ సారి తన రికార్డును తానే బ్రేక్ చేస్తాడేమో చూడాలి. పైగా కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అందుకే ఆరెంజ్‌ క్యాప్‌ రేస్‌లో కోహ్లీ టాప్‌ 4గా ఉన్నాడు.

ఈ నలుగురితో పాటు రాజస్థాన్‌ రాయల్స్‌కు ఆడుతున్న టీమిండియా యువ క్రికెటర్‌ యశస్వి జైస్వాల్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న ఆసీస్‌ స్టార్‌ బ్యాటర్‌ డేవిడ్‌ వార్నర్‌, లక్నో కెప్టెన్‌గా ఉన్న కేఎల్‌ రాహుల్‌ కూడా ఈ ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో ఉన్నారు. వీరి ముగ్గురిలో జైస్వాల్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో ముగిసిన టెస్ట్‌ సిరీస్‌లో జైస్వాల్‌ విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ ఫామ్‌ దృష్ట్యా జైస్వాల్‌ కూడా ఆరెంజ్‌ క్యాప్‌ రేసులో టాప్‌ 5గా ఉన్నాడు. ఇక డేవిడ్‌ వార్నర్‌ ఎప్పుడు నిలకడగా రాణిస్తూ ఉంటాడు. ఇప్పటికే రెండు మూడు సార్లు ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. అలాగే కేఎల్‌ రాహుల్‌ సైతం ఆరెంజ్‌ క్యాప్‌ అందుకున్నాడు. ఈ ఏడాది కూడా వీరి నుంచి మంచి ప్రదర్శన ఆశించవచ్చు. అందుకే వార్నర్‌ టాప్‌ 6, కేఎల్‌ రాహుల్‌ టాప్‌ 7లో ఉన్నారు. మరి వీరిలో ఆరెంజ్‌ను ఎవరు సాధిస్తారని మీరు భావిస్తున్నారో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి