iDreamPost

Shivam Dube: వీడియో: శివాలెత్తిన శివమ్ దూబె.. ఊచకోతకు ఇది కొత్త డెఫినిషన్!

  • Published Apr 23, 2024 | 10:10 PMUpdated Apr 23, 2024 | 10:10 PM

సీఎస్​కే పించ్ హిట్టర్ శివమ్ దూబె శివాలెత్తాడు. ఈ ఐపీఎల్​లో విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్న దూబె ఇంకోసారి తన బ్యాట్​తో తాండవం చేశాడు.

సీఎస్​కే పించ్ హిట్టర్ శివమ్ దూబె శివాలెత్తాడు. ఈ ఐపీఎల్​లో విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్న దూబె ఇంకోసారి తన బ్యాట్​తో తాండవం చేశాడు.

  • Published Apr 23, 2024 | 10:10 PMUpdated Apr 23, 2024 | 10:10 PM
Shivam Dube: వీడియో: శివాలెత్తిన శివమ్ దూబె.. ఊచకోతకు ఇది కొత్త డెఫినిషన్!

చెన్నై సూపర్ కింగ్స్ పించ్ హిట్టర్ శివమ్ దూబె ఈ ఐపీఎల్ సీజన్​​లో విధ్వంసక ఇన్నింగ్స్​లతో చెలరేగుతున్నాడు. మిడిల్ ఓవర్స్​లో బ్యాటింగ్​కు దిగుతున్న ఈ లెఫ్టాండర్.. ఆఖరి వరకు క్రీజులో ఉంటూ నమ్మశక్యం కాని రీతిలో హిట్టింగ్​ చేస్తున్నాడు. బౌండరీలు కొట్టడానికి పెద్దగా ఇష్టపడని ఈ పొడగరి బ్యాటర్.. బంతి పడిందే తడవుగా స్టాండ్స్​లోకి పంపడాన్ని అలవాటు చేసుకున్నాడు. స్పిన్, పేస్​ను సమర్థంగా ఎదుర్కొంటూ హిట్టింగ్​లో తోపుగా పేరు తెచ్చుకుంటున్నాడు. సీఎస్​కే విజయాల్లో కీలకంగా మారిన ఈ క్లీన్ స్ట్రైకర్.. లక్నో సూపర్ జియాంట్స్​తో మ్యాచ్​లో బ్యాట్​తో తాండవం చేశాడు.

స్టార్ బ్యాటర్ శివమ్ దూబె శివాలెత్తాడు. లక్నో బౌలర్లను ఊచకోత కోశాడు. 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్​ను చేరుకున్న దూబె.. ఓవరాల్​గా 27 బంతుల్లో 66 పరుగులు చేశాడు. ఇందులో 3 బౌండరీలు ఉంటే.. ఏకంగా 7 భారీ సిక్సులు ఉన్నాయి. 244 స్ట్రయిక్ రేట్​తో బ్యాటింగ్ చేసిన దూబె.. బాదుడే పనిగా ఆడాడు. యష్ ఠాకూర్ బౌలింగ్​లో హ్యాట్రిక్ సిక్సులు కొట్టాడు. స్లో బాల్స్, బౌన్సర్స్, క్వికర్ డెలివరీస్ ఇలా ఎలా వేసినా బాదేస్తుండటంతో దూబెనె ఎలా ఆపాలో తెలియక ప్రత్యర్థి బౌలర్లు గుడ్లు తేలేశారు.

నాలుగో వికెట్​కు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్)తో కలసి 104 పరుగులు జోడించాడు దూబె. సీఎస్​కే 210 పరుగుల భారీ స్కోరు చేసిందంటే అతడి హిట్టింగే కారణంగా చెప్పొచ్చు.ఆఖర్లో దూబె ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన ఎంఎస్ ధోని ఒక బాల్ ఎదుర్కొని బౌండరీ కొట్టాడు. దూబె, రుతురాజ్​ను మినహాయిస్తే మిగిలిన బ్యాటర్లు అజింక్యా రహానె (1), డారిల్ మిచెల్ (11), రవీంద్ర జడేజా (16) ఫెయిలయ్యారు. ఇక, భారీ స్కోరును ఛేజ్ చేసేందుకు బరిలోకి దిగిన లక్నో ప్రస్తుతం 1.3 ఓవర్లకు వికెట్ నష్టానికి 4 పరుగులతో ఉంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (0)ను దీపక్ చాహర్ ఔట్ చేశాడు. మరి.. దూబె విధ్వంసంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి